22వ సర్గ ; - ఎడ్ల లక్ష్మి ,, సిద్ధిపేట
యువరాజు పట్టాభిషేకము ఆగిపోవుట - వనవాసము ప్రాప్తించుట 
----------------------



"సోదరా లక్ష్మణా! తండ్రిపై కోపం వలదు 
నీలో పెల్లుబికిన శోకమును విడనాడుము 
జరిగిన సంఘటన చెడుగా భావించకు
నా ప్రయాణమునకు సిద్ధము చేయుము 

పరలోకభీతికలవాడైన నా తండ్రి 
ఆడినమాట తప్పనివాడై యుండుటచే
సత్యవచనుడుగా జీవించుచుండెను 
అతని పరితాపము నన్ను తపింపజేయును 

తండ్రి కైకేయికి చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి 
నా అరణ్యవాసమునకై నిశ్చయించుకొని
అతని మనసు స్థిరపరచుకొనెను 
ఈ విషయం నందు తండ్రిని కష్టపెట్టలేను

అదే తల్లి తండ్రి చేసిన నిర్ణయము కాదు 
నా వనవాసము భగవంతుని ఆధీనము
ఓ సోదరా అందుకు ఎవరిని నిందించకు 
కైకేయి మిక్కిలి సాధుస్వభావిని 

ఓ సౌమిత్రి! నాకు రాజ్యాధికారము 
దక్కనందుకు నీవే మాత్రము బాధపడకు 
!లక్ష్మణ! నా పట్టాభిషేకం ఆగిపోవుటకు 
పినతల్లి అయినా కైకేయి కారణము కాదు 
దైవ శక్తి ఎంతటిదో నీవెరుగుదువు గదా!

===========================

అయోధ్య కాండం నందు 22వసర్గ సమాప్తం 🙏🏻🙏🏻
కామెంట్‌లు