23వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
రాముని పై గల భక్తి తో లక్ష్మణుడు సాహసవచనములను పలుకుట 
----------------------



శ్రీరాముడు దైవ శక్తి ప్రభావం గూర్చి 
ధర్మాచరణ ప్రాముఖ్యమును గురించి 
పదేపదే లక్ష్మణునితో  చెప్పుచుండగా
లక్ష్మణుడు వినమ్రుడై  వినుచుండెను 

రాముడు ధర్మంగున్నందుకు హర్షము,
రాజ్యమును త్యచినందుకు దుఃఖము 
ఆసమయములో లక్ష్మణుడు కోపముతో 
పుట్టలోనున్న పామువలె బుసలుకొట్టును 

ఓ రామా! తండ్రి ఆదేశం అనుసరించి 
ధర్మానికి హాని కలుగునని యోచిస్తే
అధర్మవర్తనుడు రాజ్యమేలినచో 
అది ధర్మ పాలన ఎలా అవుతుంది 

ధర్మము అవహేళన పాలైనచో 
లోకము నశించునని నీవు భావించి 
వనములకు వెళ్ళుట అనవసరము 
నీవు మహాసూరుడవు ధీరుడువు

అన్నయ్య! దీనమైన అసమర్ధతను 
నీవెందులకు ప్రశంసించుచున్నావు 
పాపకృత్యములకు పాల్పడిన 
కైకేయి దశరథులు నీకు ద్రోహము చేసిరి 

కామెంట్‌లు