27వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట

నేను మీ వెంట వచ్చెదనని - సీతాదేవి శ్రీరాముని  ప్రార్థించుట  

\

సీతాదేవి చాలా సహనవంతురాలు 
ఆమె పతి ప్రేమకు మిక్కిలి పాత్రురాలు
"ఓ రామా!ఇదేమిటి ఇలా అంటున్నారు 
రాజకుమారుడవై ఇలా పలుకుట తగదు 

నీ మాటలు నాకు నవ్వు పుట్టిస్తుంది 
ఈ మాటలు వినదగినయి కావు ప్రభూ!
ఒకవేళ మీ మాటలే నిజమైనచో 
నేను కూడా వనమునకు మీతో వస్తాను.

ఈ లోకమందును పరలోకమందును 
సతులకు పతియే గతి కావున 
తల్లి, తండ్రి, ఎవరు తోడు యుండరు
అరణ్యమున నేను మీ ముందు నడిచెదను 

ఓ మహావీరా! ఈర్ష్య రోషములను వదిలి 
నన్ను కూడా నీ వెంట గొని పొమ్ము.
నన్ను ఇచట వదిలి వెళ్ళుటకు 
నేను చేసిన పాపము ఏమిటి రామా!

ఎన్ని కష్టశుకములు యున్నా కానీ 
పతి అడుగుజాడలలో సాగిపోవుటయే 
సతికి సుఖప్రదము, శుభప్రదము, ధర్మము
మా తల్లిదండ్రులు నాకు నేర్పిన ధర్మమిది,

కామెంట్‌లు