ఏ భాషలోనైనా.-2:-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


ఏ భాషలోనైనా రాయాలంటే రాస్తూ ఉండాలి. 
నిరంతరం రాస్తూ ఉండాలి. 
రాయాలంటే వాక్య నిర్మాణం తెలిసి ఉండాలి. 
రాయాలంటే వర్తమాన భూత భవిష్యత్తు కాలాల వాక్య నిర్మాణం తప్పనిసరి. 

మాట్లాడడం వేరు రాయడం వేరు 
రాయటం బాల్యం నుంచే అలవాటు పడాలి 
బాల్యంలో భాష కు మిర్రర్ న్యూరాన్స్ చాలా సహకరిస్తాయి. 
మాట్లాడానికి పద్ధతి లేదు కానీ రాయటానికి పద్ధతి అవసరం. 

రాయటానికి వర్డ్ పవర్ అవసరం 
రాయడానికి భాషలో అధికారం ఉండాలి 
రాయటానికి శైలి ముఖ్యం. ఏదైనా మాట్లాడడం వేరు దాన్ని పేపర్ పై రాయడం వేరు. 
రాయాలంటే ప్రతి వ్యక్తి రైటర్ అయి ఉండాలి. రైటర్ లా రాయాలి. 
ప్రొఫెషనల్స్ కు రాయటం అంటే ప్రొఫార్మా ఫార్మేట్ తెలిస్తే చాలు టెక్నికల్ వర్డ్స్ తెలిస్తే చాలు. 

విద్యార్థికి రాయటం అంటే సబ్జెక్టు తెలిస్తే చాలు 
రిపోర్టింగ్ చేయాలంటే వ్యవహారిక భాష తెలిస్తే చాలు. 
రాయాలంటే బాగా చదవాలి భాషను బాగా అర్థం చేసుకోవాలి. 
రాయాలంటే పదాల కన్నా వాక్యాల అవసరమే ఎక్కువ. 
బాగా రాయాలంటే కథలు చెప్పే నైపుణ్యం ఉండాలి. 
రాయటానికి గ్రామర్ అవసరమవుతుంది. మాట్లాడటానికి అవసరం లేదు. 

రోజుకు ఎన్ని పేజీలు రాస్తే అంత నైపుణ్యం వస్తుంది. 
రోజుకు ఎన్నిసార్లు రాస్తే అంత ప్రాక్టీస్ అవుతుంది. 
రోజు రాయకుండా రాయటం అంత సులభం కాదు. 
రాయడానికి రాజమార్గం చదవటం రాయటం. 
రాయటానికి వచ్చిన ప్రతి వ్యక్తి రైటరే. ఎవరి సబ్జెక్టు వారిది. 
చెప్పటం చదవడం సులభం కానీ రాయటం కష్టం. 
రాయటానికి జ్ఞాపకశక్తి సృజనాత్మక శక్తి చాలా అవసరం. 
ముఖ్యంగా ఆంగ్ల భాషకు ఇవీ చాలా అవసరం. 
=============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు