నింగిన సాగే గొబ్బుల్లారా!
నిన్న మొన్న లేనే లేరు
ఎక్కడి నుంచి వచ్చారు?
ఎక్కడెకడికో వెళతారు...
సెగలు కక్కిన సూరీడు
సేద తీరగా దిగినాడు...
అల్లల్లాడే అలల చెలులతో
మెలమెల్లగ కలిశాడు
ఒక్కొక్కరికిని హత్తుకొని...
ఒడుపుగా మమ్ము ఎత్తుకొని...
మబ్బులుగా మార్చేశాడు
దబ్బున పరుగులు తీశాడు...
చల్లని చూపుల సంద్రపు తల్లి
గగన వీధిలో మము గమనించి
తమ్ముడు పవనుని పంపించే...
అదిగదిగో మా మామయ్య!...
వరుణుడు ప్రేమతో వాటేయ...
అభ్రము కరిగి శుభ్రపు నీరై
చినుకుగ మారి చిందులు వేస్తు
కడలి ఒడిలో ఒదిగి పోయే...
తరంగిణియై తరలిపోయే...

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి