*అయోధ్య రామాలయ దొంగల కథ* పద్యము: - డి.వినాయక రావు, భైంసా, 9059494259


సీ:రామ నీగుడిలో అరాచకంబు కథను 
వినవయ్య నోర్పుగా పెనకువగను 
నపహరణము చెందె నంకముల్, నర్థమున్ 
సేవజేసెడి వారు స్తేనులవ్వ 

నమ్మినజనమంత నాగరకుండ్రవ్వ 
ధర్మంబు యెట్లగున్ ధర్మమూర్తి 
దైవంబు నీవయ్య దండించు చౌరులన్ 
దయను చూపవలదు తస్కరులకు 

తేగి: భయము లేదయ్య నీవంటె ప్రత్యగాత్మ 
జనులు నినుదోచు కున్నారు జంకులేక 
కనులు నున్ననూ చూడవా కరుణ హృదయ 
ద్రోహి దోచంగ నీసొమ్ము దేహరమున

కామెంట్‌లు