(చూపును బట్టి రూపం)
భగవంతుని రూపమది..
నమ్మన వారికి కంటికి నల్లరాయి..
నమ్మిన వారి కళ్ళకు నారాయణుడు..
కొలవని వారికి కొండరాయి
కొలిచిన వారికి కోనేటి రాయుడు..
పడని వారికి పలక రాయి..
పిలిచిన వారికి పరమాత్ముడు..
ఎంచిన వారికి ఏదో రాయి
పూజించిన వారికి పరంధాముడు..
తలచిన వారికి తిరుమలేశుడు..
వేడుకున్నవారికి వేంకటేశుడు, ఏడుకొండలవాడు..
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి