జవానులం మేం జవానులం
ప్రప్రథమున మేం కిసానులం
ప్రయత్నంతో మేం జవానులం !
మా కన్నతల్లి శ్రీమతి అన్నపూర్ణ
మాకు ఉన్న నాన్న శ్రీ శ్రీ దానకర్ణ
వారి ముద్దు మురిపాల పట్టీలం
వారికి పుట్టిన మేం జగత్ జట్టీలం
కిసానులం మేము కిసానులం
మేం మా భారతీయ కిసానులం
మేం మా భారతదేశ నివాసులం
తస్మాత్ జాగ్రత్త గల జవానులం !
మా దేశం సరిహద్దు జవానులం
దేశ సందేశం పొందిన కిసానులం
సరిహద్దు కాపలాకాయు వారలం
ప్రతి పొద్దున సేవచేయు పోరలం
హలం పట్టి పొలం దున్ను హాలికులం
జలం పెట్టి గొర్రు కొట్టు శ్రామికులం
జనజాతర జవానులం కిసానులం
మేం ఎవరికీ కాములే బేమానులం
మేము కిసానులం జవానులం
దుక్కిలోని అలాన్ని మేం పీకేస్తాం
మొక్కి మా పొలంలో ఎరువేస్తాం
ముద్దుగ మా వ్యవసాయం చేస్తాం
పొలం చుట్టూ దడిగట్టు కట్టుతాం
మధ్యన మంచెను నిలబెట్టుతాం
వాలేటి పక్షులను మేం కొట్టుతాం
రాలేటి ధాన్యంకై దోసిలి పట్టుతాం
చెత్తాచెదారాన్ని గోతిలో పోగేస్తాం
కంపోస్ట్ ఎరువు తయారు చేస్తాం
పంట పొలానికి దాన్ని చేరవేస్తాం
బంగారు పంటలను పండిస్తాం !
కూరగాయలు ఆకుకూరలు కూడా
మాపొలంలోన దండిగా పండిస్తాం
రైతుబజారుకు వాటిని తరలిస్తాం
వస్తుసామాగ్రిని కొని తిరిగి వస్తాం
ఆహారం అనివార్యం అందరికీ
ఆ ఆహారం అందేది ఎందరికీ
ఆహారహం చేస్తాం వ్యవసాయం
అధికంగా తీస్తాం ఫల సాయం
పై ప్రశ్నకు జవాబు చెప్పండి
గుప్పిట్లోనే గుట్టును విప్పండి
చెప్పక మీరు తప్పుకోవద్దండి
చెప్పేస్తే మీరేలే ఇక ముద్దండి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి