నీ ఆశయాలు లక్ష్యాలు సిద్ధించినా సిద్ధించికపోయినా
అలుపెరుగని పోరాటమే
విజయమై
నీ బ్రతుక్కోసార్థకత చేకూరుస్తుంది
కాలం నిర్లిప్తతంగా
చైతన్యహీనంగా
గడిస్తే
నీలో నిస్సహాయత
పొడచూపుతోంది
ఆశలేమి కాలహరణకు
అంకురమౌతుంది
జీవితాన్ని దుఃఖభాజనంచేయకు
గడిచిన కాలం వగచినా
పొందలేవుగా
గతం ఒక స్వీయ గుణపాఠమే
కళ్ళలో తేజస్సు
ఆశసడలనితనం
నిరాశలేనివైనం
ఆశవాదికి కాలం సహవాసిగా నిలుస్తుంది
కాలమోజ్ఞానసింధువు
కాలమంటే అరచేతిలో చూపే వైకుంఠం కాదు
తలక్రిందులైతే వైకుంఠపాళే
ఊహల్లో ఊరించే
నూతనావిష్కరణలకు
కాలమో గీటురాయి
కాలమో జ్ఞానభాండాగారం
కాలము గాలివైపు పరిగెత్తే
పతంగం కాదు
గాఢాంధకారంలో
జ్ఞానదీపం
జీవితమంటేనే కష్టనష్టాల సమాహారం
కాలం
కష్టాలను ఎదుర్కొని
కాలవినియోగంతో
ముందుకు దూసుకెళ్ళడమే
మీ(మన)ప్రగతికి సోపానం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి