పద్మశ్రీ డా.కూరెళ్ళ విఠలనేత్ర జ్ఞానీజీ శుభాకాంక్షలు: - డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


నవమాసాలు మోసిన తల్లి ఆర్ద్రత ఆయన రక్తం
నవదశాబ్దాల అక్షరాల ఆర్తగీతం  ఆ చెమట చలువ

పుస్తక వేగుచుక్కను గ్రంథాలయంలో దాచిన అల్మారా
ఆకాశంలో చుక్కలను కోసితెచ్చి 
దుగూట్లో జ్ఞాన వెలుగు నింపిన అక్షరసేనాని

ఆయన
కూరెళ్ళ విఠలాచార్య ఆత్మీయత
పద్మశ్రీ వరించిన పుస్తక ప్రేమికుడు
సాహిత్య ప్రియ స్నేహితుడు, నిత్య కృషీవలుడు అక్షర వెలుగుల రేడు
నవతిలో నవ్య చైతన్య పథకుడు

నెత్తిన వృద్ధోపనిషద్ విద్య
కాలం చదివిన ఉపనిషద్ జ్ఞానదీప్తి బతుకున
అక్షరమై బతుకు గ్రంథాలయ ఆలయ పూజార్చకుడు విఠలాత్ముడు
శుభాకాంక్షలు మీకు ఓ విఠలనేత్ర జ్ఞాని.

------------------‐---
(పద్మశీ డా.కూరెళ్ళ విఠలాచార్య గారి 89వ జన్మదినం నేడు... శుభాకాంక్షలతో...)
కామెంట్‌లు