'పర'వశమైన ప్రకృతి పరవశం: -డా.టి.రాధాకృష్ణమాచార్యులు-9849305871


చెట్లు చేమలతో నిండు నిగారింపే
ఆకుపచ్చ జవరాలు సోయగం
కొండలు గుట్టలతో గుండెల పాకే
అందాలరాశి పల్లె పడుచు నవ్వు
పరవశించే మనసు జానపదం 
మరల మరల పిలిచే రమణీయ కదంబం

గాలికీ వానకూ నేల వాలిన సుందర వనాలు 
కనుల పరవశాన ఊగే ప్రకృతి ప్రకోపం 
మౌనంలో ఊరు ఊయల పాట ముంచెత్తిన సునామీ 

పొద్దుపొద్దున్నే ఆత్మగల కొండలు గుట్టలు
కనుసైగలతో రమ్మనే ప్రియనేస్తం 
గుండెలమోసిన అమ్మే
వెలుగై మౌన మునులు కాచే కొండలు 
ఆశల విషవలయంలో పగిలిన గుండెలు 
పర వశమైన అందాలు సమతల నేలలైపోయె
 
ప్రకృతిగీతం ఆలపించే  రాగమాల 
ఆకృతి అందం కరిగిన నేల 
అదుపుదప్పిన పర్యావరణం కోరల మనిషి పర వశం ...

కామెంట్‌లు