చిత్తశుద్ధి ఉండాలి! : - -గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

లక్ష్యం చిన్నదైనా 
ప్రయత్నం పెద్దదిగా 
ఉండాలోయ్! ఉండాలి 
పోరాటం గొప్పగా 

ఆశయమే దృఢంగా 
ఆలోచన బలంగా 
ఉంటేనే ఫలితము 
వరిస్తుంది విజయము 

ఉంటే అస్థిరంగా 
గురిలేని వానిగా 
ఏది కూడా దక్కదు
ఎండమావి విధంగా 

చిత్తశుద్ధి ముఖ్యమే 
నమ్మకం అవసరమే 
ఏదైనా సాధనకు 
చరిత్రలో నిలుచుటకు 

కామెంట్‌లు