హాలో పిల్లలూ! పిస్తా పప్పులు ఒలుచుకుని తింటారు కదా! పప్పుల మీద ఉండే పెంకులు గట్టిగా బలంగా ఉంటాయి. వాటిని పారేస్తాం కదా! కానీ చాలా మంది పిస్తా పెంకులతో బొమ్మలు చేస్తుంటారు. నేను కూడా చాలా జంతువుల్ని సృష్టించాను. కానీ ఈసారి అమ్మాయిని తయారు చేశాను. కానీ ఈ పిల్ల మహా సిగ్గరి. మొహం దాచుకుని అటు తిరిగి నిలబడింది. పోనీలే ఇలాగైనా మీకు చూపిస్తాను. ఇంట్లో బాదం, పిస్తా, ఖర్జూరం అంజీర్, ఆప్రికాట్, చెర్రీలు తింటుంటాం కాబట్టి నేను ఆన్నింటితో బొమ్మలు చేసేశాను. మీరు కూడా ప్రయత్నించండి. సరదాగా ఉంటుంది. పిస్తా చియో చెట్టు ‘అన కార్టియేసి’ కుటుంబానికి, సాంపిడేల్స్ క్రమానికి చెందినది. దీని శాస్త్రీయ నామం ‘పిస్తాసియో వెరా’. వీటిలో పోషక పదార్థాలు ఎక్కువ. ఫైబర్ కూడా ఎక్కువే ఉంటుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పిస్తాలో అధికంగా ఉంటాయి. మిగతా డ్రై ఫ్రూట్లతో పోలిస్తే ఇందులో యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉంటుంది. అందువలన గుండె జబ్బుల నివారణకు ఎక్కువగా ఉపయోగపడుతాయి. రక్తంలో ఉన్న కొలెస్టరాల్ ను తగ్గిస్తాయి. ఒక ఔన్సు పిస్తా పప్పు తింటే శరీరానికి 160 కేలరీల శక్తి వస్తుంది. ఇది జీడి కుటుంబానికి చెందిన చెట్టు. పిస్తా చియో చెట్టు ఉత్పత్తి చేసే గింజలను ఆహారంగా ఉపయోగిస్తారు ఇది చెడు కొలెస్టరాల్ ను తగ్గించి రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిని చాక్లెట్లు, క్యాండీలు, స్వీట్లు, ఐస్ క్రీములు, హల్వాలలో ఉపయోగిస్తారు. ఇది పది మీటర్ల ఎత్తు పెరుగుతుంది. మగ పుష్పాలు, ఆడ పుష్పాలు వేరువేరుగా ఉంటాయి. ఈ పండు డ్రూప్ పండు. ఈ చెట్టు సుమారుగా 50 కిలోల విత్తనాలను ఇస్తుంది.
పిస్తా పెంకులతో అమ్మాయి లంగాను జాకెట్ ను కుట్టాను. అమ్మాయి వేసుకున్న ఓణీ కి సైతం డిజైన్లు కుట్టాను. ఇంతవరకు మనమ్మాయిలు ఓణీ లు వేసుకోలేదు. అందుకే సంప్రదాయ బద్ధంగా తయారు చేశాం. జుట్టు కోసం అవిసె గింజల్ని పెట్టాను. కొప్పు వేశాను. ఆ కొప్పు ముడి లో చిన్న పువ్వు కూడా పెట్టాను.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి