డా.కె.జానకిగారిRole of women infreedom struggle in Andhra Pradesh
వేదకాలం నుంచి భారతీయ వనితలు సర్వరంగాల్లో నిష్ణాతులు. హూణులు ముస్లింల దండయాత్రలవల్ల దేశం ఆర్ధిక సామాజిక రంగాల్లో పతనమై స్త్రీలకు రక్షణ కరువైంది.బాల్య వివాహాలు,సతీసహగమనం,పరదా పద్ధతితో అతలాకుతలమైంది.కానీ యుద్ధంలో పరిపాలనలో నైపుణ్యంతో విదేశీయుల ప్రశంసలు పొందినవారెందరో! ఝాన్సీలక్ష్మీబాయి అత్యంత ధైర్య సాహసాలు,పోరాట యోధురాలని ప్రశంసించారు బ్రిటిష్వాడైన సర్.హ్యూజ్ రోజ్.ఆమె రాజ్యంలోని మహిళలు పిల్లలు వాలంటీర్లుగా, ఆహారం నీరు సైనికులకు అందించారు.లలితా బెన్ బక్షి గుర్రాన్ని నడపటంలో చాతుర్యం కలది.1858మార్చిలోఆ ఝాన్సీరాణీకి యుద్ధంలో చేయూత నిచ్చింది.భవన గేట్లు మూసేందుకై, శిధిలమైన ప్రాంతాలను బాగుచేసేందుకు మగువలు తోడ్పడ్డారు. ఝార్నా గేటుకి రక్షణ గా నిలబడ్డారు.బ్రిటిష్ వారు సరాసరి తుపాకులతో కాపలాకాసిన ప్రాంతమది.బేగం జీనత్ మహల్ బహదూర్షా భార్య బ్రిటిష్ వారిని ఎదిరించిన ధీర మహిళ తమ సంపదని తిరిగి రాబట్టు కోసం జనాలకి పిలుపునిచ్చిన ప్రేరణ కలిగించిన వనిత బేగం హజరత్ మహల్ ఔదుప్రాంత రాణి వీరోచిత పోరాటం చేసింది 1857 తర్వాత సంఘసంస్కరణలు మొదలైనాయి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం తీయసాఫికల్ సొసైటీ రామకృష్ణ మిషన్ తోడ్పడుతో చదువు స్త్రీల ఉద్ధరణ వెనుకబడిన తరగతుల వారి బాగోగులు చూడటం మొదలైంది ఇది దేశ స్వాతంత్రోద్యమానికి బీజం వేసింది సంఘ సేవ కోసం ఎంతోమంది ముందుకు వచ్చారు 19వ శతాబ్దిలో రాజకీయంగా గొప్ప మార్పు వచ్చింది బ్రిటిష్ వారిని వెళ్లగొట్టాలని గొప్ప దృఢ సంకల్పం భారతీయులు మొదలైంది బెంగాల్ లో స్త్రీలంతా బెంగాల్ విభజనను వ్యతిరేకించారు ఆందోళన లేవదీశారు గాంధీజీ ప్రభావం నెమ్మదిగా దేశమంతా తాకింది అంతకన్నా ముందే 19వ శతాబ్దిలో మార్గరెట్ కజిన్స్ తన ఇండియన్ వుమన్ హుడ్ టుడే అన్న పుస్తకంలో ఆనాటి విద్య వైద్య ఆర్థిక సామాజిక పరిస్థితుల్లో నాటి భారత స్త్రీని ఆమె చక్కగా విశ్లేషించింది ఆడపిల్ల వద్దు అనే భావం ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేది మగ పిల్లలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఆడపిల్ల పుట్టగానే చంపేవారు మగ పిల్లవాడు వంశోద్ధారకుడు అని ముక్తికి సోపానం అని భావించి మగ పిల్లల్ని దత్తత తీసుకునేవారు ప్రతి కుటుంబంలో మగపిల్లాడు మహారాజుగా వెలిగిన రోజులు బాల్యవివాహాలతో హిందూ సమాజంలో ఆడపిల్ల కష్టాలు ఎక్కువైనాయి ఏడాది మొదలు పదేళ్ల లోపు పిల్లలకి పెళ్లిళ్లు చేసేవారు ఎందుకంటే వారు బాల్యం నుంచి అన్ని రకాల పద్ధతులకు అలవాటు పడి అత్యంత బాధ్యతగా మెలుగుతారని నమ్మకం ఆనాటి అత్తలు ఆడపడుచులు కోడల్ని అష్ట కష్టాలు పెట్టి రాచిరంపాన పెట్టేవారు ఇక బాలవితంతువు కష్టాలు ఎంత అంతా అని కాదు పుట్టింటిలో ఆమె వెట్టి చాకిరీతో బానిసగా వంటింటికే అంకితమైన రోజులు అందుకే బాలింతలు మరణాలు కూడా ఎక్కువగా ఉండేవి పాతికేళ్లు నిండకుండానే మహిళలు భార్య తల్లిగా పిల్లల్ని కంటూ చనిపోయేవారు.🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి