సుప్రభాత కవిత : - బృంద


చిగురించాలనే కోరిక 
మోడుకు కూడా వుంటే 
జీవించాలనే ఆశ 
మనసుకు కలగదా!

చీకటిని నిందిస్తూ 
చిర దుఃఖమే నిజమంటూ 
నిరాశలో కూరుకుపోవాలా?
వెలుగొచ్చే విషయం  తెలియదా!

వేకువకై  వేచి నిలిచి 
వెలుతురును చూసి నిలిచి 
వెతలు మరిచి అడుగు వేస్తే 
వేయి దారులు కనిపించవా!

రాబోయే కాలం తెచ్చే 
విలువైన తాయిలమేదో 
అందుకొని అచ్చెరువున
ఆనందంతో తెల్లబోవా!

తుఫాను తోసే  వేగం 
తీరం వైపే నేమో....
జీవన మార్గం మారి 
వేదన తీరిపోదా!

కనిపించని దైవం పలికే 
వినిపించని వాణిని 
పసిగట్టి పట్టుపట్టి నడిచే 
పయనమే జీవితం కదా!

కొత్తవెలుగుల వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు