ప్రాసమంజరి పద్యాలు : - డా. ధనాశి ఉషారాణి -ప్రాసమంజరి రూపకర్త -తిరుపతి జిల్లా-భాకరాపేట
 

ఉనికినిచ్చినభాషమనం రక్షిం చుదాం
భావవ్యక్తీకరణకు తెలుగువా డుదాంప
విషయవిశ్లేషణకు మనతెలుగు వాడుదాం
ఘనచరితతెలుపుటకిలతెలుగేవాడుదాం 

కష్టసౌఖ్యంచర్చకుతెలుగునువాడుదాం
భాషామాధురిపంచుటకుతెలుగువాడుదాం
మధురకావ్యరుచులకైతెలుగునువాడుదాం
పద్యాలనుపాడుటకుతెలుగునువాడుదాం 

కవులచరితనుతెలుపుటకుతెలుగువాడుదాం
భాషామాధురినిచెప్పతెలుగువాడుదాం
చాటుపద్యగుభాళింపుకుతెలుగువాడుదాం
శింజినీస్వనములుదెలుపతెలుగువాడుదాం 

 భాషావేత్తలస్మరించుభాషనసాగుదాం
పద్యసాహితివెలుగులభాషనసాగుదాం
మధురసాహితిమధుపమగుభాషనవెడుదాం
మధురరుచులనుపంచుభాషనేసాగుదాం. 

కామెంట్‌లు