కోబ్రా ఎఫెక్ట్ గురించి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
మనదేశాన్ని బ్రిటిష్ వారు పాలిస్తున్న కాలంలో, రాజధాని ఢిల్లీలో విషపూరితమైన నాగుపాముల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. దీనితో ఆందోళన చెందిన బ్రిటిష్ ప్రభుత్వం, పాముల సంఖ్యను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రజల కోసం ఒక సంస్థ ప్రకటించింది. ఎవరైతే నాగుపాము లను చంపి తీసుకువస్తారో, వారికి ఆ పాముల సంఖ్య ఆధారంగా తగిన బహుమతి లేదా నగదు పురస్కారం ప్రకటించేవారు.
ఈ పథకానికి ప్రారంభంలో మంచి స్పందన లభించింది. ప్రజలు కూడా చనిపోయిన పాములను చూపిస్తూ, బహుమతులు పొందుతూ వచ్చారు. కానీ కాలక్రమేణా, కొంతమంది కేవలం ఆ బహుమతి డబ్బుల కోసమే సొంతంగా నాగుపాములను పెంచడం. ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం, వెంటనే ఆ బహుమతిని నిలిపివేసింది.
దీనితో, ఇకపై బహుమతులు రావనే నిరాశతో పాములను పెంచిన వారే వాటిని బయటకు వదిలేశారు. ఫలితంగా గతంలో ఉన్నదాని కంటే పాముల సంఖ్య కొన్ని రెట్లు పెరిగిపోయింది. అలా, సమస్యను తెచ్చిన పథకం వల్ల పరిస్థితి గతంలో కంటే మరింత ఎక్కువగా తయారైంది. దీన్నే చరిత్రలో "కోబ్రా ఎఫెక్ట్" (కోబ్రా ఎఫెక్ట్) అని పిలుస్తారు.
ఒక సమస్యకు మనం వెతికిన పరిష్కారం, ఆ సమస్యను తగ్గించడానికి బదులు మరింత తీవ్రతరం చేయడమే ఈ "కోబ్రా ఎఫెక్ట్" .
ఇలాంటి సంఘటనలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని అనేక దేశాల్లో జరిగాయి. నేను తెలుసుకున్న మరొక సంఘటనను ఇక్కడ పంచుకోవాలనుకుంటున్నాను.
చైనాలో 'ఫోర్ పెస్ట్స్ క్యాంపెయిన్'
చైనా 1958లో మావో జెడాంగ్ అనే నాయకుడు "ఫోర్ పెస్ట్స్ క్యాంపెయిన్" అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే... ఎలుకలు, ఈగలు, దోమలు, పిచ్చుకలను నిర్మూలించే పథకం అది. దానికి కారణాలు:
ఎలుకల వల్ల ప్లేగు వ్యాధి,
దోమల వల్ల మలేరియా,
ఈగల వల్ల గాల్లో వ్యాపించే అంటువ్యాధులు వస్తుండటం,
పిచ్చుకలు ధాన్యాలు, పండ్లను తినేయడం వల్ల పంట ఉత్పత్తి దెబ్బతినడం.
ఈ కారణాల వల్లే బహుమతులు అందించారు. ఎలుకల తోకలు, చనిపోయిన ఈగలు, దోమలు, పిచ్చుకలను తీసుకొచ్చిన వారికి తగిన బహుమతులు ఇచ్చారు. ప్రజలు పిచ్చుకలను పెద్ద సంఖ్యలో చంపుతూ, వాటి గూళ్లను, గుడ్లను కూడా నాశనం చేశారు.
ఈ పథకం ద్వారా దాదాపు 1.5 బిలియన్ల ఎలుకలు, 1 బిలియన్ పిచ్చుకలు, 220 మిలియన్ పౌండ్ల ఈగలు, 24 మిలియన్ పౌండ్ల దోమలను అంతమొందించారు..
ఈ పథకం విజయవంతమైందని అందరూ భావిస్తున్న తరుణంలో, కేవలం రెండు సంవత్సరాలలో దీని దుష్ప్రభావం బయటపడటం కనిపించింది.
పిచ్చుకలు అంతరించిపోవడంతో, పొలాల్లో పురుగుల (ముఖ్యంగా మిడతల) సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. అవి వేలాది కిలోల ఆహార ధాన్యాలను నాశనం చేశాయి. దీనివల్ల ఆహార ఉత్పత్తి కంటే చాలా రెట్లు పడిపోయింది.
దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఆకలి తట్టుకోలేక దాదాపు 4.3 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారు.
ముగింపు: దీనిని బట్టి అర్థమయ్యేది ఏంటంటే... మనిషి ప్రకృతిని ఎప్పటికీ జయించలేడు. ఒకవేళ జయించాలని చూస్తే, చివరికి నాశనమయ్యేది మనిషే!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి