మన తండ్రి చేసిన వాగ్దానము మేరకే
తల్లికైకేయి నాకు వనవాసము విధించినది
నేను చెప్పిన ధర్మమార్గము గ్రహించుము
శ్రీరాముడు లక్ష్మణునితో ఇలా తెలిపి
కౌసల్యమాతకు శిరసు వంచి ప్రణమిల్లి
"తల్లి నాపై ఆన, నేను వనములకు వెళ్ళుటకు
అనుమతించి ఆశీర్వదించి పంపుము.
ఓ జనని! నీ హృదయము నుండి
శోకమును
పూర్తిగా తొలగింపుము
తండ్రి ఆజ్ఞమేర వనవాసం ముగించుకొని
మరల తిరిగి నేను అయోధ్యకు వచ్చెదను
కౌసల్యా రామలక్ష్మణులతో
వస్తానంటుంది
అమ్మా !తండ్రి బ్రతికే యున్నాడు కావున
నీ జీవిత కాలము తండ్రికి సేవలు జేయుము
నీ భర్తను వదిలి వచ్చుట నీకు తగదు.
శ్రీరాముడు ప్రసన్నురాలినిగా
జేసుకొని
ధర్మ సూత్రాలను తల్లికి బోధించును
లక్ష్మణునికి కూడా విషయములు వివరించి
తన హృదయమందే తల్లికి ప్రణతులు చెల్లించెను
-------------------------------------------------------
అయోధ్యకాండ మందు 21 టవ సర్గ సమాప్తం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి