సుప్రభాత కవిత : - బృంద


కనిపించని హృదయాల 
వినిపించని పిలుపులా 
మౌనం వేసే నిశబ్ద కేకలా 
గగన యవనిక పై విరిసే.....

సప్త వర్ణాల రంగవల్లులపై 
సప్తాశ్వరథమధిరోహించి 
షుప్త జగతిని మేలుకొలిపి 
సర్వజీవులను అనుగ్రహించి....

తేలు పాలమబ్బుల దారిలో 
తేరు కదిలి వచ్చే వేళ 
తేట వెలుగుల భువిని 
తేజస్సుతో అనుగ్రహించి

మంచు కురిసి తడిసిన 
మలయాల పలకరించి 
మమత మీరగ  తలనిమిరి 
మనసు తీర  ముచ్చటించి

వేవేల వర్ణాల విరిసిన 
పూల  సోయగము చూసి 
రాగాలు తీయు మధుపాల
గీతాలు విని మురిసి

అవనికేతెంచు అంశుమంతుని 
అపేక్షగా  అవలోకించి 
అరుణ కిరణ స్పర్శను 
అనుభవించే అంతరంగాలకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు