సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -280: ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలన్నీ తెగ కాలాయట
***
మొదటి సంది శెప్తనే ఉన్నవ్వా! యింటెనా? పెద్దోలు అనుబగించి శెప్పినవని అర్తం శేస్కోరు. గీళ్ళకేం పన్లేదు శాదత్తం ఎక్కువ .శెవిన జొర్రీగలెక్క వొర్రుతనే వుంటరని అంటరు. అయినగని అవ్వా తాకిడి తలిగితె గని నొప్పి దెల్వదు."
 " ఏంది శెల్లే!ఇంట్లె పెద్దిర్కం పన్జేయడం లేదని రంది వడ్తున్నవా? అస్లు గియ్యన్ని తల్కాయలకు ఎక్కించుకోవడం మానుకోవాలె శెల్లె. మనవెంత తక్వ మాట్లాడితే అంత మంచోళ్ళం గాళ్ళ దుట్టిలో."
 " ఓ అవ్వా! గస్మంటి పెద్దిర్కం నాకెందుకు శెప్పు. ఎన్నొద్దులో అయ్యింది. గయ్యి వొదిలేస్కుని.గాళ్ళ లెక్కలు పద్దులూ అడగట్లే..గాళ్ళ ఉజ్జోగాలు-ఆర్వాటాలు పట్టిచ్చుకోవద్దన్న సంది పట్టిచ్చుకోట్లే."
" మరెందుకు శెల్లే! గన్ని మాటలు శెప్పుట్ల అర్తం? కిష్ణ రామ అన్కుంట పెశాంతంగా ఉండక."
 " గిట్ల అన్కుంట కూసుంటే ఆడు పురాగ శెడిపోతడు.గిప్పుడే శేతికి రాకుండయ్యిండు.రేప్రేపు  గాని బత్కు ఏమైతదోనని మాపటేల నిద్దర సుత పట్టట్లేదవ్వా! సూత్తూ సూత్తూ ఎట్ల ఊకుండమంటవ్ శెప్పు."
" ఎవడు శెల్లే! నీ మన్వడేనా? ఏం శేత్తుండు? అమ్మ నాయినల్కి తెల్వకుండ ఏవఁన్న శేత్తుండా ఏంది? గిప్పటి పోరల్ని పల్కరిచ్చేటట్టే లేదు.పొద్దాక శేతిల సెల్లుతోనే .గుడ్లెందుకు గుంజవో? అటు జర్పి ఇటు జర్పి గా ఏల్లెందుకు నొప్పులు బెట్టవో మరి."
 " గంతట్తో ఆగితే మాగనే వుండవ్వా! గాడు సెల్లుల సూశేది పిచ్చి పిచ్చి మడుసుల బొమ్మలు. గయ్యేవో ఆటలు. ఒకపాలి ఒకటి నొక్కబొయ్యి ఇంకోటి నొక్కి ఏదో ఆట ఆడిండంట.లచ్చ రూపాయిలు తనబ్బిల నుంచి తీసి ఎవడో గాని దోత్తుగానికి ఇత్తుంటె సూశిన.గా ముచ్చెటి శెప్తే నీ సంగతి సూత్తనని బెదిరిచ్చిండు. గీ యిష్యాలు కొడుకు కోడలి శెవిన ఏద్దామంటే యింటెనా? పైంగ నా కొడుకంటె మీ యమ్మకి పడదు. ఒక్కోలు మన్వలని ఎంత ముద్దు జేత్తరు. వాడు జెప్తుంటే మస్తు బాదయ్యిందని శెప్తుంటె కుద్దుగ గీ శెవుల్తో యిన్నవ్వా? కోడల్ది గంత మాట అన్నంక యింట్లె వుండబుద్ది గాట్లే. ఒకేపు గా బాద ‌ఇంకోఏపు పోరడేమైతడోనని పరేషాన్ అవుతున్నవ్వా! "
 ఓ శెల్లే! గదా సంగతి! గాని తప్పుల్ని ఎన్కేసుకుంట నిన్ను తప్పుబట్టుడేంది? గా పొల్ల దమాక్ ఏమైన కరాబయ్యిందా ఏంది?"
 "ఎంత పేమున్నా" ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలన్నీ తెగ కాలాయట" అన్నట్టు మీసాలు కాలుడు కాదు ఇల్లు ఇల్లే కాలుద్ది.గాడు గిప్పుడే గా సెల్లులాటల్కి లచ్చ దీశిండంటే యింకేవన్న వుందా ఇల్లును,ఇంటోళ్ళని సుత కుదువ బెడ్తడు. గందుకే పొల్లగాండ్లని అతి ముద్దు జెయ్యొద్దు. గాళ్ళనో కంట కనిపెట్టాలె. నీ కొడుకును కోడలిని నేను రమ్మన్నని శెప్పు శెల్లే!"
**
"ఏంది ఎంకటేశూ! బావున్నవా? మీ ఆవెను సుత తోల్కరాక పొయినవ్! శానా యిష్యాలు మాట్లాడాలె. నీ కొడుక్కు సెల్లు కొనిచ్చినవట గద. గాడేం జేశిండో తెల్సునా ఏవేవో ఆటల్ల బెట్టింగులు కట్టి నువ్వు తనబ్బిల దాశిన పైసల్ని దొబ్బుక పోతుండంట. నీ కొడ్కును సుత తోల్కరాక పొయినవ్. "
 గాడే వత్తా అన్నాడవ్వా! గా పైసలు దీశేది నిజమా అవ్వా! గదేమో గని కీసలో పెట్టుకున్న పైసల్ల వొంద దప్ప మిలిగినవి బొయినయి."
ఏందో గని గాని పశిమొగం సూత్తుంటె నమ్మవుద్ది కాట్లేదు నిజవంటవా అవ్వా! "
  " అగ్గో నీ కొడ్కు వత్తుండు గద గిప్పుడో నాట్కం ఆడ్త నువ్వు సూత్తుండు" అనుకుంట..." 
"పసాదు గాడు రాంగనే'బావున్నవారా శిన్నోడ! మీ నాయినమ్మ నా తాన పైసలు దాశింది ఇంగో ఇవ్వు అనంగనే గా శిన్నోడి కళ్లల్ల మెర్పులు.గుంజుకున్నట్టే తీస్కున్న కొడుకును జూసి తెల్ల మొగం వేశిండు.గాని సెల్లు సూత్త యియ్యిరా అంటే ఎంతకి ఇయ్యలే."
 ఇంటికి పోనుజేసి తనబ్బి సూడమంటే సూశిన గాని బార్య లబ్బ లబ్బ గుండెలు బాదుకుంట ఏడ్వబట్టింది."
యిష్యం అర్థమైంది. అవ్వ శెప్పిన "ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలన్నీ తెగ కాలాయట అన్నట్టుంది.ఏం జెయ్యాల్నో తెల్వట్లే."
 " పోరణ్ణి కొడ్దామా? తెల్శీ తెల్వని వొయిసు.గట్టిగంటే ఏవన్న జేస్కుంటడేమోనని బయం."
" అవ్వా! ఏం జెయ్యాల్నో నువ్వే శెప్పవ్వా! గుడ్ల నీళ్ళు దిప్పుకుంట అడ్గుతుంటే అవ్వకి శెల్లెకి సుత కండ్లల్ల నీళ్ళూర్నయి. పోరడు సెల్లు పట్కొని ఆడ్తనే వుండు. "
 "ఒక్క మాటరా అయ్యా! ఇంటి దీపమని ముద్దాడితే ఎంత పనైందో సూశినవ్ గద.అతి గార్వం సేత్తే గిట్లనే వుంటది యవ్వారం.ముందుగాల నువ్వు, కోడలు ఆరం దినాలు ఎటూ బోకుండ గాన్ని సుత ఇంట్లెనే ఉండెటట్లు శెయ్యుండ్రి. మీ సెల్లులు దాయుండ్రి గాని సెల్లుమీద నిఘా వెట్టుండ్రి.గాని శేతిల నుంచి తప్పించుర్రి.పెద్ద వైజ్గుడి కాడికి సుత తోల్కబొయ్యి సూపుర్రి" అని శెప్పి పంపింది."
 మల్లొచ్చినప్పుడు అవ్వా! నా మన్వడు గిప్పుడిప్పుడే దారికొత్తుండు అంతా నీ సల్వే అవ్వా!" అంటుంటే అవ్వకి మస్తు సంబురమైంది."
గదండీ సంగతీ!" ఇంటి దీపమని ముద్దాడితే మూతి మీసాలన్నీ తెగ కాలాయట"  అంటే గిదే మరి."
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం