హలో పిల్లలూ! ధనియాలు కూరల్లో వేసుకునే మసాలా దినుసులు మాత్రమే కాదు. ఆడపిల్లల్ని సృష్టించే గింజలుగా కూడా మారాయి. ఈ విత్తనాలను కూరల్లో వేసుకోవడమే కాదు వీటి ఆకుల్ని సైతం కూరల్లో సువాసన కొరకు వేసుకుంటాం. అదేంటో తెలుసా! కొత్తిమీర. ఇది కేవలం సువాసన కోసం మాత్రమే కాదు, అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి. ఈ ధనియాల శాస్త్రీయ నామమెంటో తెలుసా! “కొరియాండ్రమ్ సెటైవమ్”. ఇది ఏ కుటుంబానికి చెందిందో తెలుసా! ‘అంబెల్లిఫెరె’ కుటుంబానికి ‘ఏపియేల్స్’ క్రమానికి చెందిన మొక్కలు. ఆకులు ఆకుపచ్చ రంగులో చక్కగా డిజైన్ లో కత్తిరించినట్లుగా అందంగా ఉంటాయి. నేను ఆకుల్ని కూడా బొమ్మలలో వాడుకున్నాను. ధనియాలతో కారప్పొడి, సాంబారు పొడి చేసుకుని కూరల్లో వాడుకుంటారు. పువ్వులు తెల్లగా ఉదారంగులో గుత్తులుగా ఉంటాయి. ఆకులు, పూలు చాలా అందంగా చిత్రకారుడి కత్తిరింపుల్లా అద్భుత సౌందర్యంతో ఉంటాయి. ధనియాలను కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం కలిగించేందుకు వాడుకోవచ్చు. ఇవి డైయూరిటెక్ గా, రిఫ్రిజిరేటింగ్ గా, యాంటీ స్పాస్మోడిక్ గా, హైపో గ్లైసీమిక్ గా, కార్మినేటివ్ గా, పని చేస్తాయి. కొత్తిమీర ను దాదాపు అన్ని వంటకాలలో సువాసన కొరకు, కూరల అలంకారం కొరకు ఉపయోగిస్తారు. ధనియాలతో ఆయుర్వేద ఔషధాలు తయారు చేస్తారు. అజీర్ణాన్ని, అతి దప్పికను తగ్గించడానికి వాడతారు.
డ్రాయింగ్ పేపర్ మీద ఒక బొమ్మను గీసుకున్నాను. ఆ బొమ్మను అనుసరించి స్కర్టు, జాకెట్ గా వేసిన దాన్ని గింజలతో అలంకరించాను. స్కర్టు కోసం ధనియాలను ఉపయోగించాను. శనగ పప్పుతో జాకెట్టు కుట్టాను. చేతులకు గాజులుగా కారప్పూసను పెట్టాను. ధనియాల స్కర్టు, శనగ పప్పు జాకెట్టు, కారప్పూస గాజులు పెట్టుకుని ధనలక్ష్మి తయారయింది. ఎంత బాగుందో చూశారా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి