సుప్రభాత కవిత : - బృంద


గుండెలోని కోరికలే 
గుంపుగా సాగే గగనాన 
గువ్వలాగా నా మనసు 
గూడు వదిలి ఎగిరె నింగికి ...

నవ్వులన్నీ దాచుకున్న 
పువ్వులాటి హృదయాన 
నేటి ఉదయ వేళలో 
కోటి భావాలు ఉప్పొంగా..

రంగులీను అంబరాన
పొంగుతున్న సంబరాల
హంగులన్ని  మదిలోన 
చెంగు చెంగున వెల్లివిరియ...

కోరుకున్న తీరం కోసం 
పరుగులు తీసే కెరటంలా 
ఉరకలేస్తూ ఆనందాలు 
ఉప్పెనలా ముంచేయగా....

అమృతపు ధారలోన 
ఆత్మ తానమాడినట్టు 
అంతరంగమంతటా 
అనిర్వచనీయమైన హాయి నిండగా..

కనకధారలో తడిసిన 
కడలి అలల మెరుపులు 
కన్నులకు విందుచేయ 
కదిలి వచ్చు వేకువకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు