సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత:278: ఇసుక తక్కెడ- పేడ తక్కెడ
***
"ఏందిరా అయ్యా! నీకు నువ్వే నవ్వుకుంటున్నవ్! గదేదో నాకు సుత శెప్పరాదురా నేను నీ లెక్క ఆయిగా నవ్వుతా."
"అవ్వా!'గీ లోకం పోకడ సూత్తుంటే నవ్వొత్తుంది. మడుసుల్లో మంచి శెబర అన్నది లేదు. ఎవలికి ఆడే పక్కోన్ని తొక్కి పైకి రావాలె అనుకుంటుర్రు. కుట్రలు కుతంత్రాలు శేత్తుర్రు. మోసాలతో బతుకుతుర్రు."
 "ఏందిరా అయ్యా! యేదాంతం మాట్లాడవడ్తివి. గొంగట్ల కూసిని ఎంటికెలొత్తున్నయంటే ఏం ఫాయిదా.పెపంచకమే మారి పోయింది.శిన్ని నా బొజ్జెకి శీరామ రచ్చ అని అనుకుంటుర్రు.గింతకీ ఎవల్ని ఎవలు మోసం జేసిండ్రు జెర జెప్పరాదురా?"
 "శెప్తవ్వా!గా గుండయ్య మావఁ తెల్సుగద. గా మావఁ ఎస్మంటోడో ఊల్లె అందర్కీ తెల్సు.గా మావఁ  పైవేటోళ్ళు ఎవలికో బోకర్గ ఉండి ఊల్లె పంటల్కి యిత్తనాలు అమ్ముడు మొదలువెట్టిండు. గా మావఁ యిష్యం తెల్శినోళ్ళు ఎవలూ గాయిన తాన యిత్తనాలు కొన్నోళ్ళు లేరు. ఇంగ నెత్తిన గుడ్డేసుకొనే సయిమానికి పీరయ్య మావఁ కల్శిండు. పీరయ్య మావఁ ఎస్మంటోడో నీకు తెల్వందేముంది.మా కంకుష్టోడు. మాయ మాటలు శెప్పుట్ల మొదగాల వుండేటోడు ఎవలంటే శిన్న పోరగాళ్ళు సుత ఎంటనే పీరయ్య మావఁ పేరు శెప్తరుగద.ఇంగ గాల్లిద్దరు ఓదినం కల్సుకుర్రట. ఇంగ ఆటెంక... "
 " వొరేయ్ వారీ! జెర తొరగా గా ముచ్చెటి ఏందో శెప్పురా అయ్యా ఆత్రమాగట్లె."
" గుండయ్య మావఁ! గా నకిలీ విత్తనాలను పీరయ్య మావఁ పదెకరాలకు సరిపడ దర తగ్గిచ్చి ఇత్తనన్నడట. గా దానికి పీరయ్య మావఁ ఉబ్బి పొయ్యి డబ్బులిచ్చి యిత్తనాల్ని తీసుకుండు."
పంటేశిండు తాలు తప్ప తప్పనే శేతికొచ్చింది.గిదేందని నిలదీత్తే ఎహె పోవయ్య కొన్నంక నాదేం బాద్దెత లేదు అని గద్మాయించిండంట. గది యిన్న పీరయ్య మామ నీ అంతు సూత్త.నన్నే మోసం జేత్తావ్ అన్కుంట బోయిండంట."
"ఐతె మల్ల ఏమైందిరా అయ్యా!"
ఏమైందేంటి అవ్వా! పీరయ్య మావఁ ఏం జేసిండో సూశినవా...గంతకి మునుపు ఎప్పుడో గుండయ్య తాన రొండు లచ్చలు మిత్తికి దెచ్చిండంట. గీ ఇత్తనాల యిష్యంల తేడాలొచ్చినయి గద. నా పైసలు నాకిత్తవా లేదా అని గుండయ్య మావఁ అడ్గితే తిప్పి తిప్పి శివరాకరికి పెటపెటలాడే నోట్లు తెచ్చి మిత్తి సుత కల్పి యిచ్చిండంట. గయ్యి యింట్లె దాశి మల్లెవలికన్న మిత్తికి యిద్దమని అనుకుండట. గాట్ల శాన్నాళ్ళు సూశి ఎవలు అడగట్లేదని బేంకుల దాశెతందుకు ఎల్లిండంట."
 ఎల్తే ఏమైందిరా అయ్యా!"
 " ఏమైంది ఏందవ్వా!  గా మావఁ శేతతిల నోట్లను జూసి అనుమానమొచ్చి పరీచ్చ జేత్తే నకిలీ నోట్లని తేలింది.
"గియ్యి నీ తానికి ఎట్లొచ్చినయ్ అంటే పీరయ్య మావఁ పేరు జెప్పిండంట.ఇద్దర్ని టేషన్లేసి ఉతుకుతుర్రు.గిప్పుడు తెలుత్తది నకిలీ యత్తనాలు నోట్ల ముచ్చెటి."
 " సరిపాయె బాగనే ఉంది కత ఇసుక తక్కెడ- పేడ తక్కెడ కతొతికె "
 " ఏందవ్వోవ్! గీళ్ళ ముచ్చెటిని కతే శెప్తనంటున్నవ్! ఏందో అది?"
 " అవ్వా!అవ్వా! నువ్వు కతలు శెప్పక శాన్నాల్లయింది.శెప్పుడు తొరగా శాల్ జెయ్యి అవ్వా " భూలచ్మి,బుడ్డోడు సదువుకుంటున్నోళ్ళల్ల ఉరికొచ్చి అవ్వకి శెరో పక్కన కూసుర్రు."
"అనగనగా ఒకూల్లో ఇసుక అమ్మేటోడు,పేడ అమ్మెటోడు శెరో ఎదురు పుల్లల తక్కెడ పట్కొని ఊరూరు తిర్గేటోళ్ళు.గాళ్ళు ఓ పాలి ఓ శెట్టుకింద కల్శిర్రు. మాట ముచ్చెటి బెట్టుకొని పడుకున్నట్టు యాచ్చన్ జేసి ఒకల్దొకలు కాజేసి ఎల్లిర్రు. గా యిసుక తక్కెట్ల బోత్తే జారుడేనాయె. పేడ తక్కెట్ల యేత్తె కారుడేనాయె. మోసం జేసుకుర్రు గని ఎవలికి ఏం లాబమొచ్చుడు లేదు.పైంగ గా ఎదురు తక్కెళ్ళు ఆడ్తరా అని కొనేతోల్లతో తిట్లు పడుడు. అగ్గో గట్ల మోసం జేసుకున్నా ఫాయిదా లేనోళ్ళ ముచ్చెటి జెప్పేటప్పుడు గీ సామెత యాదికి దెచ్చుకుంటరు."
"గిప్పుడు గా గుండయ్యకీ,గీ పీరయ్యకి లాబం గూబలోకి బోయింది గద. ఒకలికొకలు మోసం జేస్కొని ఊసలు లెక్క వెట్టుకుండ శిప్ప కూడు తినవట్టిరి.గదేరా కత."
" గట్ల ఎవల్ని మోసం జెయ్యాలని సూడొద్దు కదవ్వా! అంటున్న భూలచ్మి, బుడ్డోడు మాటల్కి సంబుర పడ్తూ...
"మా నాయినే! నా బంగారే అన్కుంట దగ్గరకు తీస్కొని గప్పుడే సుడ్తున్న సున్నండ శెరొకటి శేతికిచ్చింది."
 గదండీ సంగతీ! "ఇసుక తక్కెడ- పేడ తక్కెడ అంటే గిదే మరి.కత అర్థమైంది గద."
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం