జీవితం : - కోరాడ నరసింహా రావు!

 

దా0పత్య జీవనంతో.... 
   కుటుంబ బంధాలను 
 కాచి,వడపోసిన జీవితం 
 
 పేగు బంధాలు , రక్త సం బంధాలు...
   అవి యే బంధాలైనా... 
 అన్నీ రుణాను బంధాలే నని... 
  రుణాలు తీరిపోతే... 
 ఎవరికి వారే... యమునా తీరే నని... 

ఎన్ని అనుకున్నా, ఆడుకున్నా... 
  తిట్టు కున్నా, కొట్టు కున్నా... 
 ఒకరికి ఒకరై చివరికి మిగిలేది
   భార్యకు భర్త... భర్తకు భార్యేనని.... 
 ఇది ఏడేడు జన్మల  బంధమనే... 
   సత్యాన్ని తెలసుకున్న దంపతులు వీరు....! 
  అంతిమ మజిలీని వీడి పోయేందుకు... 
  పాయనమైనారు...!! 
     *****

కామెంట్‌లు