ధర్మపరిరక్షణ మన కర్తవ్యం: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి) -సెయింట్ లూయీస్-అమెరికా


   " ధర్మో రక్షతి రక్షితః" అన్నది మన సనాతన ధర్మం. జగతిన ఉన్న ప్రజలంతా పరమేశ్వర ప్రతిరూపాలని, మానవత్వమే మాధవత్వమని  ఆచరించి కులమత రహితంగా ఆకలితో వచ్చిన అన్నార్తులకు క్షుద్భాధ తీర్చాలని చెప్పే మన  హిందూమతం.
     రుద్ర సూక్తంలో కూడా  చెట్టులోను, పశు పక్ష్యాదులలోను, రాతిలోను అన్నిటా భగవంతుడు ఉన్నాడని చెబుతుంది
ఉదాహరణకు
"నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశా0చ పతయే
నమో నమో వృక్షేభ్యో హరి కేశేభ్య: పశునాం పతయే నమో నమః  " అని 
అన్నిటా భగవంతుని చూసే  మన సంప్రదాయం
       అన్ని మతాల సారం ప్రేమతత్వమే అని అనాది నుంచి అందరిని ఆదరించే ఏకైక మతం మన మతం ఒక్కటే
స్వేచ్ఛగా  అందరు తిరగగలిగి ఉండే దేశం నా భారతావని.
     అనాది నుంచి భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే సమాజం
మత సామరస్యానికి ప్రతీక
విగ్రహారాధన కు ప్రాధాన్యత నిచ్చి అనేక దేవాలయాలు ఉదాహరణకు రామాలయాలు,శివాలయాలు, దేవతమూర్తులు
కనకదుర్గ, కామాక్షి, మీనాక్షి, అయ్యప్ప, ఆంజనేయ స్వామి వంటి దేవతామూర్తుటు నూకాలమ్మ, మైసమ్మ, బంగారమ్మ, మావుళ్ళమ్మ, ముత్యాలమ్మ వంటి గ్రామదేవతల ఆరాధన అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే దేశంలో నేటి విగ్రహాల ధ్వంసం ఎంత వరకు సమంజసం?. ఇది భక్తుల మనోభావాలను దెబ్బదీయడమే
   " రామో విగ్రహవాన్ ధర్మః" అని ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు అటువంటి రాముని విగ్రహం విజయనగరంలోని రామతీర్థం లోకొన్ని సంవత్సరాలక్రితం ధ్వంసం చేస్తే రెండు రోజులు నిరసన  చేసారు.ప్రభుత్వం కూడా ఏమున్నదిలే అని ఊరుకుంటే భక్తుల హృదయాలు క్షోభకు గురి అయ్యాయి. ఇప్పటికీ దుండగులకు శిక్ష పడలేదు
కాకినాడలో దేవతామూర్తులను ధ్వంసం  కాలితో తన్ని మనోభావాలు దెబ్బతీయడమే.
  ఇప్పుడు  తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో మొన్నటి వరకు శరన్నవరాత్రి దేవిపూజలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా  భక్తి శ్రద్ధలతో అందరు జరుపుకున్న మర్నాడే అక్టోబర్ 13 న విగ్రహాన్ని కాలితో తన్ని ధ్వంసం చేసిన సంఘటన ఉద్రిక్తతకు దారితీయడం అటు హిందూ సంఘాలు, బి.జె. పి. కార్యకర్తలు  ఆందోళన చేయడం సి. సిఐ.కెమెరా ల ద్వారా దోషులను  గుర్తించామని చెప్పడం హర్షణీయమే.
   ఒక ప్రశ్న సూటిగా ప్రభుత్వానికి, కొంతమంది పరిణితి చెందారని చెబుతున్న పెద్దలకు అడుగుతున్నా దొరికిన వారికి మతి స్థిమితం లేదని అంటున్నారు .అలాగే కొన్ని చోట్ల మూత్ర విసర్జన చేసిన సంఘటన లు కూడా సంవత్సరాల క్రితం వెలుగు లోకి మీడియా ద్వారా వచ్చాయి .వాటికి కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదు. సూటిగా విజ్ఞులు, ప్రాజ్ఞులు అంటున్న వారిని అడుగుతున్నా ఇదే ఘటన మిగతా మతాల వారి విషయంలో జరిగితే ఊరు కుంటారా. ఇప్పటికే హిందూ దేముళ్ల  చెప్పులు పాశ్చాత్య దేశాల్లో ఆ మధ్య మీడియా లో చూసాను. 'జన్మానామ్ నరజన్మ దుర్లభం' అంటారు ఎందుకంటే యుక్తాయుక్త విచక్షణ కలిగిన ఏకైక ప్రాణి  సృష్టిలో మానవుడు ఒక్కడే. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే మనకంటే పశువులు నయం అనిపిస్తోంది. దుండగులు శిక్షించబడాలి
ధర్మ పరిరక్షణ కు మనమందరం మరో శివాజీ మహారాజ్ లా మారుదాం
'లోకా సమస్తా సుఖినో భవంతు' అన్నది పాటించిన
అవసరమైతే అల్లూరి, భగత్ సింగ్ లా మారాలి .ధర్మో రక్షతి రక్షితః అన్నది చాటుదాం.!
(ఈ మధ్య జరుగుతున్న విగ్రహాల ధ్వంసం, మన ధర్మంపై వ్యంగ్య సంభాషణలను చూసి భాధాతప్త హృదయం ఆర్ద్రతతో వ్రాసినది)
...........................
కామెంట్‌లు