చిరునవ్వు దివ్వెలు: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా


పసిడి బుగ్గలతో
పక పక నవ్వుతు
పలకరిస్తే చాలు
పరవశముతో
అమాయకంగా
అరవిచ్చిన గులాబీలా
ఆట పాటలతో
అందరిని ఆనందపరచే
తప్పటడుగులతో
తీయని చిలుక పలుకులతో
తన్మయత్వము చెందించు
చిరునవ్వుల
చిరుదివ్వెలు
పండంటి పసిపాపలు
పరమాత్ముని ప్రతిరూపాలు..!!
.........................


.....................
కామెంట్‌లు