నిశ్శబ్దంగా రగిలే ఆవేదన
తనువు మోసే భారం కన్నా
అనంతం.
నింద మోయలేక
కుంగే సాయంత్రం
మధ్యాహ్నపు ఎండను మించి
తీక్షణంగా ఉంటుంది.
పగ్గం తెంచుకున్న గుర్రంలా
ముందుకు ఉరికే సమాజంలో
విధి ముఖం చాటేసిన జూదరిలా
ఎలా వంచిస్తుందో ఆందోళన.
రక్షణ కవచం
కరువైన ప్రయాణానికి..
ఏ క్షణం ఏమవుతుందో?
ఏ నమ్మకం తోడుగా నిలిచినా సరే
దగా చేసే సమయం ముందు
శరణాగతుడే ఎవరైనా....

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి