కరువుదీర్చు వరుణదేవా!;- కాల్వ రాజయ్య


 ఆ.వె

ధరణి మండుచుండె దాహంబుతోడను 
దినము లన్నిగడిచె దినుసులలుక 
జాడలేదు నీవు జగతినేడున్నవో
వచ్చికరువుదీర్చు వాన దేవ
ఆ.వె
చెరువు లెండి భువిన కరువువచ్చెను సుమ్ము
కరుణజూపకున్న మరణమౌను 
అంబరాన్నిజూసి అలిసెను రైతన్న 
కురువువర్షమింక వరుణదేవ
కామెంట్‌లు