మీ మంచి మనసే చాలు.
పిడికిట ఒదిగేటి పిచ్చుకా!రావే
వడ్ల కంకులు వచ్చాయి కొత్తగా
వచ్చి తినిపోవే.
చుట్టాలు వచ్చే శుభవార్త చెప్పు
కాకమ్మా!కాకమ్మ కబుర్లు
కరువాయ నేడు.
మా ఇంటి శునకమా విశ్వాస రూపమా!
నీ సాటి ఎవ్వరే
బువ్వతిందువురావే.
చిలుకా, హంసా
చిట్టికాళ్ల నెమలీ ఆటపాటల తోడ
నా అలసట తీర్చరా?
మీ కోసమే వచ్చా
ఈ చిట్టిడివిలోకి
మీ స్నేహమే చాలు,
నా బ్రతుకు నిండు వెన్నెలగా మారు.
మూగజీవాలతో
సాగే స్నేహాలు
సరిగమలతో సాగు సంగీత కీర్తనలే.
ప్రకృతిని కాపాడి
మనిషి సుకృతికై పాటుపడే
పక్షి సంతతిని, పశుసంతతిని,
పసిపాపల వలె కాపాడ వలె
మనిషీ ఇవ్వవలె
మూగ జీవాలకు
తన హృది లోన
పదిలమైన చోటు🐄🦚🐓🦩🐇🐑🪽🐇

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి