సరస్వతీమాత అనుగ్రహంతో సాహిత్యంలో కీర్తి శిఖిరాన్ని చేరుకున్న సాహితీమూర్తి.
బాల్య స్నేహితుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి సహచర్యంలో కవిత్వంపై ఆశక్తి కలిగిందని చెప్పారు.
మీరు వ్రాసిన కావ్యం గబ్బిలం ఆనాటి అంటరానితనం కులవివక్షతకు దర్పణం.
అల్పప్రాణి గబ్బిలం ద్వారా బాధను కాశీవిశ్వేశ్వరునికి చేరవేయమన్న విన్నపం ఆర్ద్రతా భరితం.
ఫిరదౌసిలో కవిరాజ మహమ్మద్ గజనీచే పరాభవం పొందిబాధపడిన తీరు చదువురల కన్నీటి పర్యంతమే.
జాతిపిత బాపూజీ పై మీరు వ్రాసిన రచన దేశభక్తికి మాహాత్ముని త్యాగానికి ప్రతీక.
దేశ దశాదిశా మార్చి యువతకు ప్రేరణనిచ్చిన స్వామివివేకానంద గురించి వ్రాసినరచన ఎందరికో ప్రేరణ
.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నియమితులై చేసిన సాహితీ సేవ మరువలేనిది.
సాక్షాత్తు వేదస్వరూపులు చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారిచే గండపెండేర సత్కారం పొందడం మీ పాండిత్యప్రతిభకు ప్రతీక.
కవికోకిల, కవిదిగ్గజం, కళాప్రపూర్ణ, కేంద్రసాహిత్య అకాడమీ, పద్మభూషణ్ పురస్కారాలకే వన్నెతెచ్చిన మీరు నవయుగ కవితాచక్రవర్తియే..!!
.........................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి