తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం దక్కింది.కెనడా నుండి వెలువడే "తెలుగుతల్లి మాసపత్రిక"
"కెనడా డే" సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కవితా పోటీల్లో హైదరాబాద్ కు చెందిన కవయిత్రి , ప్రభుత్వోన్నత పాఠశాల ఉపాధ్యాయిని శ్రీమతి చంద్రకళ.దీకొండ రచించిన "ప్లాస్టిక్ మయ ప్రపంచం" కవితకు గాను విజేతలలో ఒకరిగా నిలిచి,ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని స్వంతం చేసుకున్నారు.ప్రపంచ నలుమూలల నుండి తెలుగు కవులు పాల్గొన్న ఈ పొటీల్లో సాహిత్య విలువలు,సామాజిక బాధ్యతల సమ్మేళనంగా నిలిచిన ఈ కవిత న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది. అంతర్జాతీయ విజయంపై సాహితీమిత్రులు,సహోపాధ్యాయులు మరియు విద్యార్థినీ,విద్యార్థులు హర్షం వ్యక్తం చేసారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి