నవ్యాశలు చిగురించేలా
నింగినుండి భరోసాలా
దిగివచ్చే ధైర్యంలా ....
చీకటి మూసిన చిత్రాన్ని
వేకువగా వెలిగించే
రేపటి ఆశల దీపం
రెప్పలలో వెలిగిస్తూ...
కానరాని దారులన్నీ
కంటి మెరుపులో కనిపించేలా
కనిపించని విజయాలను
కనుల ముందు నిలబెడుతూ....
అడుగు అడుగుకూ
అంధకారాన్ని తొలగిస్తూ
అంతరంగపు అలజడిని
అంతరింపచేస్తూ....
కమ్ముకున్న కలతలను
కిరణాలతో తొలగించి
కట్టెదుర విజయాన్ని
కనులవిందుగా చూపిస్తూ..
తిమిరపు తెరలు తోసి
గమనపు తీరులు చూపి
పయనము సుగమం చేసే
మాయని వరమిచ్చే వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి