అమ్మానాన్నలు... ఒక అద్భుతమైన వరం: ...మంజుల పత్తిపాటి


మనం నడవక ముందే
మన కోసం దారులు వేసిన వారు...

మనం మాట్లాడక ముందే
మన మౌనాన్ని అర్థం చేసుకున్న వారు...

మన చిరునవ్వు కోసం
వారి కన్నీళ్లను దాచుకున్న వారు...

మన కలలు నెరవేరాలని
వారి కలలను పక్కన పెట్టిన వారు...

మనకు ఆకలి వేస్తూందని...
వారి ఆకలిని మరచిన వారు...

మనం ఎత్తుకు ఎదగాలని కోరుకునే ముందు,
మంచి మనిషిగా ఎదగాలని కోరుకునే వారు...

కాలం మారుతుంది...
వయసు మారుతుంది...
ప్రపంచం మారుతుంది...
కానీ...
అమ్మ ఒడిలోని ఆప్యాయత,
నాన్న చేతిలోని భరోసా
ఎప్పటికీ మారవు,
కాని మనం మారుతున్నాం...

అమ్మనాన్నలు మనపై ఉంచిన నమ్మకాన్ని
వమ్ము చేస్తూ జల్సాలకు అలవాటు పడి 
వాళ్లకు కంట తడి పేట్టిస్తున్నాం...

రండి మనం మారుదాం...
మనం సంపాదించిన ఆస్తి అంతస్తుల కంటే,
మంచి మనిషిగా ఎదగామని చూపింద్దాం...


అమ్మ నాన్నలు 
ఈ జన్మకు మనకు దొరికిన
అత్యంత గొప్ప ఆస్తిపాస్తులు 
తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు
===================================
 మంజుల పత్తిపాటి
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం
 చరవాణి 9347042218.
కామెంట్‌లు