మాజీ సైనికుడు బోయిని వెంకటయ్యకు సన్మానం
జూలై 26 కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని సోమవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వీర జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జ్యోతులు వెలిగించి కార్గిల్ యుద్ధంలో అమరులైన వీర సైనికులను స్మరించుకుంటూ వారికి సెల్యూట్ చేశారు.ఈ సందర్భంగా హస్నాబాద్ గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బోయిని వెంకటయ్యను ఘనంగా సన్మానించారు. దేశ సరిహద్దుల్లో విశిష్ట సేవలందించిన ఆయన, ప్రస్తుతం వెటర్నరీ డాక్టర్‌గా పనిచేస్తూ రైతులకు సేవలందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు.మాజీ సైనికుడు బోయిని వెంకటయ్య మాట్లాడుతూ, దేశ సరిహద్దుల్లో కుటుంబాలను వదిలి ప్రాణాలను పణంగా పెట్టి దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికుల త్యాగాలను ఎప్పటికీ మరువరాదన్నారు. వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అలాగే దేశానికి అన్నం పెట్టే రైతు, దేశ సరిహద్దులను కాపాడే సైనికుడు ఇద్దరూ సమాజానికి ఎంతో విలువైన వారని, వారిని ఎల్లప్పుడూ గౌరవించాలని అన్నారు. కార్గిల్ విజయ్ దివస్‌ను నిర్వహించి వీర జవాన్లకు నివాళులర్పించడం అభినందనీయమైన కార్యక్రమమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డా. మల్లేశం, అనంతరెడ్డి, రామ్‌రెడ్డి, సామాజిక కార్యకర్త కేడియం వెంకట్, ప్రభు శంకర్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, ఆచార్యులు, మాతాజీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి