ఇందూరు జంట కవులకు దాశరథి పురస్కారం.

 ఇందూరు జంట కవులకు దాశరధి పురస్కారం లభించింది. దాశరధి కృష్ణమాచార్యులు జయంతి వేడుకల్లో భాగంగా నగరంలోని బాపూజీ వచనాలయం లో దారం గంగాధర్ రచించిన హితోక్తులు తోగర్ల సురేష్ రచించిన సౌగంధిక స్వయంవరం  పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ భుజంగరావు హాజరై మందారం పుస్తకం ఆవిష్కరించారు. తె వి వి తెలుగు భాషా చైర్మన్ కనకయ్య సౌగంధిక పుస్తకం ఆవిష్కరించారు. సభాధ్యక్షులుగా బాపూజీ వచనాలయం అధ్యక్షులు భక్తవత్సలం నిర్వహించగా కవి సామ్రాట్ వి.పి చందన్ రావు ఆత్మీయ అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ రచయిత కవి డాక్టర్ గంట్యాల ప్రసాద్ ప్రముఖ కవి రచయిత ఇప్పకాయల సుదర్శన్ పుస్తకాలను సమీక్షించారు. ఈ సందర్భంగా మహాకవి డాక్టర్ దాశరధి కృష్ణమాచార్యుల ఒక వంద ఒకటవ జయంతి వేడుకల్లో భాగంగా దారం గంగాధర్ కు తోగర్ల సురేష్ కు బాపూజీ వచనాలయం వారు దాశరధి పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కవులు రచయితలు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts