కొత్త చిగురు :- పంచదార్ల మాణిక్యాలరావు


 నీది మౌనం
నాది నిరీక్షణ
ప్రస్తుతానికి, ఇద్దరికీ పరీక్షే!
 
రాలిపోయిన ఆకు,
ఓ ముగిసిన అధ్యాయం
కొమ్మను మళ్ళీ అతుక్కోదు.
 
నిశ్శబ్దం
ఓ అప్రకటిత ఆరంభం!
అది ఎండైనా, వానైనా
అలుపుకు సెలవు ఇచ్చే సమయమే.
 
మట్టిలో కలిసిపోయిన
పాత జ్ఞాపకాలను
మళ్ళీ తవ్వి చూసుకోవడం
నాకు కొత్తేమీ కాదు!
 
కామెంట్‌లు
Popular posts