అది వాన కాదు
ఆకాశం కరిగించిన కన్నీరు
అది మేఘం పంపిన
మహంకాళి ఆశీర్వాదం !
నగరంలో వాన అంటే....
ఆటోల కింద... బస్సుల కింద
నీళ్లు చిన్నచిన్న సముద్రాలు
జల్సా చేసే పిల్లలు...
కాగితపు పడవలు
వదిలే బడి పిల్లలు.
ట్రాఫిక్ జామ్ లో.....
హారన్ల సింఫనీ.....
ఇది నగరపు వాన
ఆఫీసుల్లో...
"సర్... వర్షం వల్ల లేట్" అనే మెసేజ్లు!
చాయ్... పకోడీ...
బజ్జీల అమ్మకం డబుల్!
కిటికీలోంచి చూస్తూ...
"ఇంటికి ఎలా వెళ్ళాలి"
అనే టెన్షన్!
ఇది నగరపు వాన!
పేదవాడి గుడిసెలో...
ప్లాస్టిక్ కవర్తో కప్పుకునే పరుగు!
కారుతున్న కప్పు కింద...
బిందెలు... గిన్నెలు!
తడిసిన బట్టలు... ఆరని ఆకలి!
ఇది కూడా నగరపు వాన !
ధనికుడి బంగ్లాలో... "పవర్ కట్
అయ్యింది" అనే ఫిర్యాదు!
ఇన్వర్టర్... జనరేటర్!
వాన చూస్తూ కాఫీ! "
ఎంత రొమాంటిక్ వెదర్"
అనే స్టేటస్!
వాన నేర్పే పాఠం....
వాన... కులం చూడదు!
మతం చూడదు!
పేదోడు... ధనికుడు
అని తేడా చూడదు!
అందరి మీద
ఒకేలా కురుస్తుంది!
వాన... శ్రమ దోపిడీని
కడుగుతుంది!
రోడ్డు మీద దుమ్మును...
మనసులో మలినాన్ని...
అన్నీ కడిగేస్తుంది!
వాన... నగరానికి గుర్తు చేస్తుంది
"నువ్వు ఎంత ఎదిగినా...
నీకు నీళ్ళు కావాలి!
నీకు మట్టి వాసన కావాలి!
నువ్వు ప్రకృతి బిడ్డవే!" అని!
సామాన్యుడి మొక్కు
అమ్మా మేఘమా!
అతిగా కురవకు తల్లీ!
ఇల్లు మునిగిపోకుండా చూడు!
పంట నాశనం కాకుండా చూడు! కానీ...
తక్కువగానూ కురవకు!
భూగర్భ జలాలు పెరిగేలా చూడు!
చెరువులు నిండేలా చూడు!
రైతు పొలం పచ్చబడేలా చూడు!
"వాన వస్తే...
పంట పండుతుంది!
పంట పండితే...
కడుపు నిండుతుంది!
కడుపు నిండితే...
లోకం నవ్వుతుంది!"
నగరవాసులు మాత్రం...
వర్ష దేవా నగరంపై కురవకు
అనే దండం పెట్టుకుంటారు
"నగరంలో వాన...
ఒకరికి ఆనందం!
ఒకరికి బాధ! ఒకరికి సెలవు!
ఒకరికి కష్టం!
" ... అందరికీ సమానం!
అదే ధర్మం గురుదేవా!
ప్రకృతి మనకు నేర్పే
మొదటి పాఠం ఇదే!
నగరములో వర్షం పడితే...
ట్రాఫిక్... ట్రాఫిక్... నరకయాతన!
రోడ్లు చెరువులవుతాయి....
కరెంటు పోతుంది
ఇంట్లో కూర్చుని "
వర్షం ఎప్పుడు ఆగుతుందా"
అని గొణుగుతాం !
పల్లెల్లో వర్షం పడితే.....
పొలాలన్నీ పచ్చబడతాయి
బావులు నిండుతాయి
రైతన్న ముఖంలో
వెయ్యి దీపాలు వెలిగుతాయి
"ఈ సంవత్సరం
పంట బాగుంటుంది"
అని దేవుడికి
దండం పెడతాడు
వాన పడితే... గొడుగు పంచు!
ఆకలి ఉంటే... అన్నం పెట్టు!
చలి ఉంటే... దుప్పటి కప్పు!
అదే నిజమైన వరుణ దేవా పూజ!"
==============================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
"సాహితీ శిరోమణి "
భాగ్యనగరం
9247313488
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి