మాట్లాడాలంటే మాట్లాడాలి
మాట్లాడాలంటే శ్వాస తీసుకోవడం లా ఉండాలి.
మాట్లాడాలంటే పదాలు చాలు పెద్దపెద్ద వాక్యాలు అవసరం లేదు.
మాట్లాడడం అంటే కమ్యూనికేట్ చేయడం
కథ చెప్పడం కాదు.
చెప్పాలనుకున్నది అవతలి వ్యక్తికి అర్థమైతే చాలు.
అడిగిందానికి సమాధానం సంక్షిప్తంగా ఉండాలి.
ప్రశ్నలు సులువుగా సూటిగా ఉండాలి.
మొత్తంగా స్పష్టంగా ఉండాలి.
మాట్లాడమంటే ఎదుటి వ్యక్తి శక్తిసామర్థ్యాలను పరీక్షించడం కాదు.
మన శక్తి సామర్థ్యాలను తెలపడం కాదు.
మానవ సంబంధాలు బంధాలు పెంచుకోవడం
మాట్లాడమంటే ఆ భాషలో ప్రేమలో పడటం.
ఆ భాషలో అధికారం కావాలంటే అర్హత కావాలంటే
నిరంతరం ఆ భాషలోనే మాట్లాడాలి నిద్రలో కూడా ఆ భాషలోనే మాట్లాడాలి.
కలలు కూడా ఆ భాషలోనే కనాలి మొత్తంగా ఆ భాషలో ప్రేమలో పడాలి.
మాట్లాడటం అంటే మనుషులతోనే మాట్లాడటం కాదు
వస్తువులు పరికరాలు యంత్రాలతోనూ మాట్లాడాలి
మాట్లాడటం అంటే ప్రశ్నలు సమాధానాలు
మాట్లాడటం అంటే డైలాగ్ మాట్లాడటం అంటే కాంటెంట్
మాట్లాడటం అంటే రహస్యం కాదు మాట్లాడటం అంటే మర్మం కాదు
మాట్లాడటం అంటే ప్రపంచాన్ని పరిచయం చేయటం
మనల్ని పరిచయం చేసుకోవడం.
మాట్లాడటం అంటే వ్యాపారం కాదు. మాట్లాడటం అంటే వ్యవహారం కాదు.
మాట్లాడటం అంటే వస్తువులను అమ్మడం కాదు. మాట్లాడటం అంటే నాగరికత.
మాట్లాడటం అంటే క్యారక్టర్. మాట్లాడటం అంటే వ్యక్తిత్వ వికాసం.
భాష ఏదైనా మాట్లాడేది ఎవరైనా అమ్మ భాష లా ఉండాలి. బోధించేది అమ్మై ఉండాలి.
===================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి