హలో పిల్లలూ! గుమ్మడి కాయలతో కూరలు తింటారా! తినరు కదా! నాకోద్దు అమ్మా అనేస్తారు. గుద్ముడి పులుసు చాలా బాగుంటుంది తెలుసా! గుమ్మడి హల్వా కూడా బాగుంటుంది. మిమ్మల్ని గుమ్మడి లవర్స్‌గా మార్చడానికే నేనీ బొమ్మలు చేస్తున్నాను. గుమ్మడి కాయ గురించి తెలుసుకుందామా ! గుమ్మడి పండు లాంటి పిల్లాణ్ని కనమ్మా" అంటూ ఆడపిల్లల్ని ఆశీర్వదిస్తారు. గుమ్మడి పండు పసుపు రంగులో గుండ్రంగా ఉంటుంది. కాబట్టి గుమ్మడి పండు లాంటి బిడ్డడు అని అంటారు. గుమ్మడి కాయల్లో రెండు రకాలుంటాయి. తియ్య గుమ్మడి, బూడిద గుమ్మడి అని రెండు రకాలు. నేను తియ్య గుమ్మడిని వాడాను. ఇది ‘‘కుకుర్బిటేసి’’ కుటుంబానికి చెందిన తీగ జాతి. దీని శాస్త్రీయ నామం "కుకుర్భిటా పెపో " (cucurbeta pepo). దీన్ని సంస్కృతంలో ‘‘కూష్మాండం’’ అంటారు. తమిళంలో ‘‘శర్కర పూషిణి’’ అని, కన్నడంలో ‘‘కుంబల’’ అని పిలుస్తారు. ఇందులో కూడా ఎన్నో ఔషధ గుణాలున్నాయి. దిష్టి తీయడానికి దీన్ని ద్వారం దగ్గర పగల కొడతారు. ఈ కుటుంబంలోని మొక్కలలో గుమ్మడే ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆకులు హృదయాకారంలో ఉంటాయి. కాండానికి బరువైన వెంట్రుకలుంటాయి. గుమ్మడి పూలను గొబ్బెమ్మలకు, బతుకమ్మలకు పెడతారు.
గుమ్మడి వేపుడు కోసం సన్నగా తరిగిన ముక్కల్ని చూడగానే నాకు బొమ్మ చెయ్యాలనిపించింది. అమ్మాయిని అందంగా సృష్టించాను. గుమ్మడికాయ తొక్కును జుట్టుకు వాడుకున్నాను. లంగాను కుచ్చిళ్ళతో కుట్టాను. చింతగింజల కళ్ళు, చెవులు, నోరు, వేళ్ళు కూడా గుమ్మడి తొక్కలతోనే చేశాను. జాకెట్‌కు ఉల్లిపాయ ముక్కలు వేసి కుట్టాను. మా అమ్మాయి బాగుందా !.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి