వనములో ప్రశాంతముగా గడిపి వచ్చిన పిదప
నీ మాటలను సంతోషముతో వింటాను
అతని మాటలు విని ఆమె శోకించును
మిక్కిలిగా దుఃఖిస్తున్న తల్లిని చూసి
అతడు దుఃఖితుడై తల్లితో ఇలా అంటాడు
ఆ మహారాజు ఆజ్ఞను కాదనలేనమ్మా
ఇక భరతుడే నీకు పరమ విధేయుడు
నేను అయోధ్యనొదలి వెళ్లిన పిదప
శోకించకుండా తండ్రిని జాగ్రత్తగా చూసుకో
శ్రద్ధ శక్తులతో ఆయనను సేవించుము
ఇదే,వేదవిహితము, శాస్త్ర సమ్మతము
కుమారా! సరే జాగ్రత్తగా వెళ్ళిరమ్ము
రామా! నీ వనవాస దీక్షను ముగించుకొని
దిగ్విజయముగా తిరిగి రమ్ము
"ఓ రాఘవా! నీకు శుభములు కలుగును
వనములకు వెళ్ళదలుచుకున్న రాముని
కన్నతల్లి తదేకదృష్టితో జూచెను
ఆయనకు శుభములు కలగాలని గోరుచు
శుభలక్ష్ణణసంపన్నుడైన శ్రీరాముని ఆశీర్వదించెను.
==================================
అయోధ్యకాండమునందు 24 గవ సర్గ సమాప్తము🙏🏻🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి