విలువలేదు.
చెడు లేకపోతే మంచికి విలువ లేదు.
దుర్మార్గమే లేకపోతే సాధుత్వానికి
విలువలేదు.
అంధత్వం వచ్చినప్పుడు కదా నేత్రవిశిష్టత,
అర్థమయ్యేది.
ఇది మంచి అని చెప్పడానికి పక్కన చెడ్డ ఉండాలి.
ఆ రెండు అక్కచెల్లెళ్ళు కాదు
పక్కా శత్రువులు.
మంచి చెడుల మధ్య అనాదిగా
మొదలైందియుద్ధం.
త్రేతాయుగ కథ, మంచి చెడుల సంగ్రామం. దాని పేరే రామ రావణ
యుద్ధం.
మంచి ఒక మెట్టు ఎక్కితే, చెడు పడుతుంది చీకటి బాట. సత్యంతెలిసినా తెలివి లేని చెడు
తెలుసుకోదు తన
వ్యవహారం.
అందుకే యుగాలు మారుతున్నా, జగాలనంటుకొని
గోడ మీద బల్లిలా
చెడు, కలియుగంవరకు అతుక్కొనేఉంది మనుషులను
ద్వాపరలో దుర్యోధనాథుల రూపంలో లోక విధ్వంసానికి ముందడుగు వేసినా, నిలువెత్తు మంచి, కృష్ణ అవతారమై తుంచిపారేసింది
చెడు బలాన్ని.
కలియుగంలో దానికి వరం, దుర్మార్గం
చెడుబలం కాల రూపమై కబళిస్తున్నది
మంచినీ. దుష్టుని చేతలు నేడు గొప్ప రాతలైనాయి. ధర్మదేవత ఒక్క కాలు మీద నిలబడి నిరాశ నిస్పృహలతో సహనాన్ని కోల్పోతున్న ది.
కలియుగ సంగ్రామం,కలిపురుషుని ఉగ్రరూపం
తట్టుకునే నేడు బతకాలి మంచి మనిషి.
అవతారదైవశక్తి
క్షిప్రత తగ్గి దుష్టత్వదుమారం
కష్టంసాధ్యమాయేనని
దేవి భాగవతం చెప్తున్నదని పెద్దల మాట.
చెడునిఎదుర్కొనే శక్తి ఇవ్వగలిగింది పరాశక్తిఒక్కటె. ఆమెను
కలి కల్మషాల
జయించే శక్తి మంచికి ఇవ్వమని ప్రార్థిద్దాం.మనవంతు గా మంచికే ఓటు.
చెడు చీడపురుగు
అమ్మ కన్ను తెరిస్తే పరుగో పరుగు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి