విధి..!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


 ఒక గ్రామంలో అక్క తమ్ముడు ఉంటారు. వాళ్లు సాధారణ జీవితం గడుపుతుంటారు. ఎలాగైనా ఎదగాలని చదువుకుంటారు. గొప్పవాళ్లు కావాలని కలలుగంటారు. విధిరాత వల్ల అమ్మానాన్నలను కోల్పోతారు. చివరికి వాళ్లు పేదరికంలోకి నెట్టివేయబడతారు. చదువు ఆగిపోతుంది పకీర్లుగా మారుతారు. ఒకరోజు తమ్ముడిని విడిచి అక్క చనిపోతుంది. అక్క పంచభూతాల్లో కలిసిపోయి ఐదుగురు గొప్ప శక్తివంతమైన నాయకులుగా మారుతుంది. తమ్ముడు దిక్కుతోచని స్థితిలో ఉంటాడు. ఒక దిక్కు పేదరికం మరోవైపు చదువు ఆగిపోయింది. పూట గడవడం కష్టంగా ఉంది. అయినా బ్రతుకు వెళ్లదీస్తుంటాడు తమ్ముడు. 
తమ్మునితో పాటే ఈ ప్రపంచం ఎదగాలని లేదా ఈ ప్రపంచం కూడా తమ్మునితో పాటే చావాలని శపథం చేస్తుంది అక్క. ఇప్పుడు పంచభూతాలు తమ్ముడు చేతుల్లో ఉన్నాయి. తమ్ముడు చెప్పినట్లు వింటున్నాయి. తమ్ముడు చెప్పినట్లు చేస్తున్నాయి. ప్రపంచం ఆశ్చర్యపోయింది మూగబోయింది మౌనంగా ఉంది. 
తమ్ముడు ఎదగడం లేదు ప్రపంచం సహాయం సహకారం చేయటం లేదు. ప్రేమను ఇవ్వటం లేదు. ఈ విషయం తమ్మునికి తెలియదు. ఒంటరిగా అమాయకంగా జీవిస్తుంటాడు ఒక ఫకీరు లా. అక్క తన పనితను చేసుకుంటూ పోతుంది. అందరిని పంచభూతాల్లో కలుపుకుంటూ పోతుంది. ప్రపంచం గెలుస్తుందా..!? పంచభూతాలు గెలుస్తాయా..!? తమ్మునికి తెలియదు అక్కకు తెలియదు ప్రపంచానికి తెలియదు. ఇది విధి ఆడిన ఒక గొప్ప నాటకం. 
======================================
డా ప్రతాప్ కౌటిళ్యా. విశ్రాంత అధ్యాపకులు.
కామెంట్‌లు