హాలో పిల్లలూ! ఈ మధ్య చియా విత్తనాల వాడకం పెరిగింది. చాలా మంది బరువు తగ్గడానికి చియా విత్తనాలను తింటున్నారు. జ్యూస్ చేసుకుని అవకాడో కలుపుకుని తాగుతున్నారు. మా ఇంట్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ వాడుతున్నాం. చియా సీడ్స్ ప్యాకెట్ ఫ్రిజ్ లో అడుగున పడిపోవడం వలన చూడలేదు. చాలా రోజుల తర్వాత గమనించేసరికి ఎక్స్ పైరే డేట్ అయిపోయింది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ అమ్మాయిని చెయ్యాలనుకున్నాను. కాకపోతే ఈ విత్తనాలు నల్లగా ఉంటాయి కాబట్టి నల్లటమ్మాయి తయారవుతుందని అనుకున్నాను. ఇవి దోసగింజ ఆకారంలో ఉంటాయి. బూడిదరంగు మరియు నలుపు రంగులతో తెల్ల మచ్చల్ని కలిగి ఉంటాయి. దీని శాస్త్రీయనామం “సాల్వియా హిస్పానికా (salvia hispanica). పుదీనా మొక్కల జాతికి దగ్గర సంబంధం కలిగినది. ‘లామియేసి’ కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కలు. దీనిలో పోషకాలు పుష్కలంగా దొరకటం వలన వీటిని ‘సూపర్ ఫుడ్’ అంటారు. చాలా మందికి సబ్జా గింజలకు, చియా గింజలకు తేడా తెలియదు. రెండూ ఒకటే అని భ్రమిస్తారు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ గింజలను నానబెట్టి స్మూతీస్, ఓట్స్, సలాడ్స్ లో కలుపుకుని తింటారు. ఇవి తినటం వలన కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. రక్తపోటు తగ్గుతుంది. ఇది దక్షిణ మెక్సికో దేశానికి చెందిన మొక్కలు.
చియా విత్తనాలతో అమ్మాయి శరీరాన్ని సృష్టించాను. బిస్కెట్లను గౌనుకు డిజైన్ గా అమర్చాను. జుట్టు, కాళ్ళు శనగ పప్పుతో పెట్టాను. గులాబీ రెక్కల నోరు పెట్టాను. గుండ్రటి కళ్ళు పెట్టాను. చియా విత్తనాల పాప అందంగా ఉన్నది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి