శ్రీమద్రామాయణము అయోధ్య కాండము ;- ఎడ్ల లక్ష్మి
శ్రీరాముడు సీతాదేవికి వీడ్కోలు పలికి 
సుమంత్రునితో బయలుదేరినాడు 
పురద్వారము దగ్గరకు రాగానే 
లక్ష్మణుడు రామునితో రథమెక్కినాడు 



అయోధ్యపురమునంతయూ గాంచగా 
జ్యోతుల వెలుగులతో మెరుస్తుంది 
వీధులన్నీ ఎంతో అందంగా యున్నాయి
పక్షులు కిలకిల రాగాలను చేస్తున్నాయి

రామలక్ష్మణులు రథముపై వెళ్తుంటే 
వీధిలో జనులంతా పుష్పాలు జల్లుతూ
రామునికై జయ జయ ధ్వనులు పలుకుతూ 
మంగళ హారతులతో స్వాగతం పలికిరి

రాముని గూర్చి సీత గూర్చి జనులంతా 
సంతోషముగా పొగుడుచుండిరి 
కోషల దేశానికి రాముడే రాజని
మునులు జనులంతా పొగుడుచుండిరి 

వీధులన్నీ ఏనుగులతో రథములతో 
జనసమూహముతో కిక్కిరిసి యుండెను 
వీధులన్ని కళకళలాడుచుండెను 
శ్రీరాముడు సంతోషంగా వెళ్లుచున్నాడు.

కామెంట్‌లు