పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, గానకోకిలకు అక్షరాంజలి పోటీల్లో పాల్గొని ప్రశంసాపత్రం సాధించారు. అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, ఐఎస్ఓ గుర్తింపు పొందిన మొట్టమొదటి సాహిత్య సంస్థ ఐన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో తిరుమలరావు పాల్గొని ప్రశంసాపత్రం పొందారు. ఇటీవల పరమపదించిన ప్రముఖ గాయని ఎస్.జానకికి నివాళిగా శ్రీశ్రీ కళావేదిక కవితలను ఆహ్వానించగా తిరుమలరావు పంపిన పాటలపల్లకి ఎస్.జానకి అనే కవిత ప్రశంసాపత్రం సాధించింది. 169 రాష్ట్ర సదస్సులు జాతీయ కవి సమ్మేళనాలు ప్రపంచ మహాసభలను ఎంతో వైభవంగా నిర్వహించిన శ్రీశ్రీ కళావేదిక, 36 ప్రపంచ రికార్డులను సాధించిన ఏకైక సాహిత్య సంస్థగా నిలిచింది. గత పదేళ్లుగా వివిధ ప్రత్యేక పర్వదినాల్లో ఆయా సందర్భాలననుసరించి కవితలు కథలు వ్యాసాలు వంటి సాహిత్య ప్రక్రియల పోటీలు నిర్వహిస్తూ వేలాది మందిని ప్రోత్సహిస్తున్న ఘనత శ్రీ శ్రీ కళా వేదిక సొంతం. తిరుమలరావు పంపిన రచనలో ముప్పై ఎనిమిదిలో పుట్టి నలభై ఎనిమిది వేల పాటలు పాడి ఎనభై ఎనిమిదేళ్ళ వయసులో శివైక్యం చెందిన జానకి ఒక పాటల పల్లకి అంటూ రచించారు. ఎస్ జానకి అంటే సింగర్ జానకి, ఎస్ అనవలసిందే ప్రతి పాటకి అంటూ తనదైన శైలిలో ఆమె జీవితాంశాలను రచించి తిరుమలరావు ప్రశంసలు పొందారు. ఎస్.జానకి తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పొందిన పురస్కారాలను కవితాత్మకంగా వివరిస్తూ తిరుమలరావు పంపిన కవిత ప్రశంసాపత్రం సాధించింది.
ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన ఈ పోటీలకు శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ నేతృత్వం వహించగా, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో, జాతీయ ప్రణాళికా అధికారి డా.టి.పార్ధసారథి, జాతీయ కార్య నిర్వహణ అధ్యక్షులు నూక సంపత్ కుమార్, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ నల్లా భాగ్యలక్ష్మి పర్యవేక్షణలో జరిగిన ఈ నీరాజనం కవిత పోటీలకు సువర్ణ జోషి, సబ్బెళ్ళ వెంకట మహాలక్ష్మి రెడ్డి, తాటి హరీష్, పి.సాయి సంతోషి, సమన్వయకర్తలుగా వ్యవహరించిరి. ఈ సందర్భంగా వీరితో పాటు శ్రీశ్రీ కళావేదిక జాతీయ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైన సాహూసంథ్య, డా.బాలచందర్ సాదే, నరసింహశర్మ, చండ్ర వెంకటేశ్వరరావు, డా.కావూరి శ్రీనివాసశర్మ, మళేకార్ నాగజ్యోతి, పుల్లేటికుర్తి శ్రీనుబాబు తదితరులు తిరుమలరావును ప్రత్యేకంగా అభినందించారు. రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి