పాలఖండ్యాంలో ఘనంగా మెగా పీటీఎమ్
 

బడిలో విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకై చర్చలు జరుపుకునే పండగే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ముఖ్యోద్దేశమని పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్.ఎల్.కుమారి అన్నారు. మెగా పీడీఎమ్ వేదికపై ఆమె అధ్యక్ష ఉపన్యాసం చేసారు. స్థానిక సచివాలయం కార్యదర్శి దూడ రంజిత్ కుమార్, గ్రామ పెద్దలు పెద్ది సత్యం, దారబోయిన వెంకట అప్పారావు, పలిశెట్టి సూర్యనారాయణ, పి.వేణు, చాంతాటి లక్ష్మి, పక్కి ప్రహ్లాద, కొర్నాన వెంకట సీతారాం, పులప శ్రీనివాసరావు, లోపింటి జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ అతిథులతో పాటు తల్లిదండ్రులు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులకు ఉపాధ్యాయులంతా స్క్రీన్ పై పాఠశాల విద్యా పథకాలను వీక్షింపజేసారు. విద్యార్థుల బోధనాభ్యసనా సామగ్రి జాదూ పిఠర కిట్ ను తొలుత ప్రదర్శించారు. విచ్చేసిన వారందరికీ ప్రదర్శన సామగ్రిని చూపి ఉపాధ్యాయులంతా వివరించారు. తల్లిదండ్రులకు తరగతిగదిలో ఐ.ఎఫ్.పి. స్క్రీన్ పై రాష్ట్ర ప్రభుత్వ విద్యా శాఖ అమలు చేస్తున్న పథకాల గూర్చి ఉపాధ్యాయులు వీక్షింపజేసి అవగాహన పర్చారు. బాలబాలికలు డొప్ప రాజేశ్వరి, డి.యామిని,  చిర్రా అమృత, పిల్లల విజయలలిత, మోక్షిత్ రామ్, రేవంత్, భవ్యశ్రీ, లతీఫ్, పూర్ణానంద్, హేమశ్రీ, గౌతమ్, యేగేష్, కృష్ణ, గోవర్ధన్, దివ్యశ్రీ మరియు తల్లిదండ్రులు  ప్రసంగించారు. వీరికి అతిథుల చేతులమీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీల్లో అలజంగి అరుణ బృందం ప్రథమ స్థానంలో నిలిచి, బహుమతులు అందుకున్నారు. 
అనంతరం విద్యార్థుల ప్రగతిని హాజరును సమీక్షించి చర్చించారు. అందరితో సహపంక్తి భోజనాలు గావించారు. 
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయని ఆర్ ఎల్ కుమారి, ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, ఉప్పలపాటి ఆదిలక్ష్మి,  వై.వి‌.రమణ, వెలగాడ రాము, ముల్లు సుజాత, ఎంటీఎస్ టీచర్లు కర్రి రమణ, చింతపల్లి రాజేశ్వరరావు, జీఎంఆర్ విద్యా వాలంటీర్ పిల్లల దాలమ్మలు పాల్గొన్నారు. వీరితో పాటు అంగన్వాడీ కార్యకర్త కుప్పిలి లక్ష్మి, ఉరిటి సౌజన్య, బత్తుల రామలక్ష్మి, పలిశెట్టి చంద్రమ్మ, పి.శ్యామల, చిర్రా డిల్లీశ్వరి, సిహెచ్ అలివేలు, సిహెచ్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు