మనం ఏమాత్రం అవకాశం ఇచ్చిన మన మైండ్ లో (గతం) జ్ఞాపకం లేదా భవిష్యత్తు కీ సంబంధించిన ఊహ ఒక డ్రామాలా నడుస్తుంటుంది. జరిగిపోయిన దాని గురించి కానీ జరగబోయే దాని గురించి కానీ ఒక డ్రామా మన మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. దీనివల్ల భయంకరమైన -బ్రమా- భయము-కలుగుతాయి. మరి ఈ డ్రామాను ఆపాలంటే ఏం చేయాలి.
వర్తమానాన్ని అంటే మన కళ్ళ ముందు ప్రస్తుతం మన ముందు ఉన్న దానిపై మనసు నిలపాలి దీన్నే మనం ఏకాగ్రత అంటాం. దీన్ని కేవలం చేస్తున్న పని వలన కానీ వర్తమానానికి చెందిన ఆలోచనలతో ఈ డ్రామాను ఆపవచ్చు. జరిగిపోయిన అంశం జరగబోయే దాని గురించి ఊహించుకుని జ్ఞానాన్ని వదిలి బ్రమా భయానికి గురవుతాం కనుక ఆ డ్రామాలు ఆపడానికి వర్తమానంలో మన పనిలో గాని లేదా దానికి సంబంధించిన ఆలోచనలలో ఉంటే సరిపోతుంది. మరో అవకాశం గతం భవిష్యత్తు పట్ల బ్రమలను భయాన్ని తొలగించాలంటే జ్ఞానాన్ని అంటే అవేర్నెస్ను ఆశ్రయిస్తే సరిపోతుంది.
ఈ డ్రామా మెదడుకు ఉన్న అవేర్నెసా లేక మెదడు చైతన్యమా తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే చైతన్యం అవేర్నెస్ వల్ల ఏర్పడుతుంది. ఈ అవేర్నెస్ గతంలోని జ్ఞాపకం వల్ల ఏర్పడుతుంది. దాన్నుంచి ఇమేజినేషన్ ప్రారంభమవుతుంది.. కనుక అవేర్నెస్ గతం వర్తమానం నుంచి పుట్టి భవిష్యత్తులోకి అంటే జ్ఞాపకం ఊహల్లోకి ప్రవేశిస్తుంది. కానీ కాన్సియస్నెస్ చైతన్యము ఇంటలిజెన్స్ వల్ల కూడా ఏర్పడుతుంది. ఇంటెలిజెన్స్ కూడా జ్ఞాపకం ఒకటే కాదు కదా. కనుక ఇంటలిజెన్సీ అవేర్నెస్ లో భాగం కావడం వలన మనకు అవేర్నెస్ వల్ల కాన్షియస్ నెస్ లేదా చైతన్యం ఏర్పడుతుందని నమ్ముతున్నాం.
అంటే అవేర్నెస్ వల్ల మరియు చైతన్యం యంత్రాంగం వల్ల జ్ఞాపకము ఊహ పుడుతుందని మనకు తెలుస్తుంది. ఈ జ్ఞాపకాన్ని మరియు ఊహను కంట్రోల్ చేయాలంటే. వర్తమానంలో ఒక పనిని కానీ ఆలోచన కానీ ఏకాగ్రతలో చేయాలి. దీన్నే అవేర్నెస్ అంటాం. లేకుంటే మనలో ఆలోచనల పాత్రలు డ్రామా నడుస్తూనే ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఇచ్చిన వర్తమానాన్ని ఆ డ్రామా ఆక్రమిస్తుంది. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశాలు ఏవంటే అవేర్నెస్ మరియు మెదడు చైతన్యం. చైతన్యంలోకీ అవేర్నెస్ను ప్రవేశపెడితే నే ఊహ మరియు జ్ఞాపకం పనిచేస్తుంది. అవేర్నెస్ అంటే జ్ఞానము లేదా సమాచారం. కాన్సస్నెస్ అంటే మెదడు చైతన్యం. మెదడు చైతన్యంలోకి అవేర్నెస్ను ప్రవేశపెడితేనే డ్రామా నడుస్తుంది. కాబట్టి మెదడులో డ్రామాకు ముఖ్యకారకం అవేర్నెస్ అంటే సమాచారం. అది గతం కావచ్చు వర్తమానం కావచ్చు. లేదా భవిష్యత్తు కావచ్చు. అవేర్నెస్ వళ్ళనే కాన్షియస్నెస్ లేదా మెదడు చైతన్యం పనిచేస్తుంది. ఈ డ్రామా మొత్తానికి కారణం అవేర్నస లేక మెదడు చైతన్యమా అన్నదానికి సమాధానం మనకు కావాలి...!?
===========================================
డా ప్రతాప్ కౌటిళ్యా
విశ్రాంత అధ్యాపకులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి