గుర్తు చేస్తున్నారంటే
వాళ్లు మనల్ని రెచ్చగొడుతున్నారని కాదు
మనం పోగొట్టుకున్న తాళం చెవిని
మనకు తెచ్చి ఇస్తున్నారని అర్థం.!!
వాళ్లు మళ్లీ మళ్లీ మనల్ని
పొగుడుతున్నారంటే వాళ్లు మనల్ని
గొప్పగా చూస్తున్నారు అని కాదు
వాళ్లకు మన అవసరం అంతగా అవసరమైందని అర్థం.
వాళ్లు మళ్లీ మళ్లీ మనల్ని
చులకన చేస్తున్నారంటే వాళ్లు మనల్ని అవమానిస్తున్నారని కాదు
వాళ్ల పని వాళ్లు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి.
వాళ్లు మళ్లీ మళ్లీ మనల్ని
అప్రతిష్ట పాలు చేస్తున్నారంటే వాళ్లు మనల్ని
కీర్తి ప్రతిష్టల నుంచి దూరం చేస్తున్నారని కాదు
వాళ్లు పాలల్లోనీళ్లు కలుపుతున్నారని మనం అర్థం చేసుకోవాలి.
==============================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి