ఆత్మీయులు..!!: -సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.


మనం అత్యున్నత శిఖరాలను 
అధిరోహించినప్పుడు 
మన సంతోషం అక్కడ ఉంటుంది. 
అప్పుడు 
అక్కడ ఉన్నవారు గొప్పగా ఉంటారు 
వాళ్లే గొప్ప ఆత్మ బంధువులు అవుతారు.!!

మనం అత్యంత విషాద సమయంలో 
ప్రమాదంలో ఉన్నప్పుడు 
అక్కడ అంత విషాదమే కనిపిస్తుంది. 
కానీ అక్కడ ఉన్నవారు ఆదుకున్న వారు 
అత్యంత ఆత్మీయులు అవుతారు 
ఆపద్బాంధవులవుతారు...!!

పరిస్థితులు సంతోషాన్ని విషాదాన్ని సృష్టిస్తాయి.
పరులను పరమాత్ములను పవిత్రులను చేస్తాయి. 

మనసు మనుషులను కలుపుతుందని ఇది చెప్తుంది. 
అన్నిచోట్ల మనకు ఆత్మీయులు ఉండరు 
మనసు అక్కడ ఉన్న వాళ్ళనే ఆత్మీయులుగా మారుస్తుంది....!!
==================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
కామెంట్‌లు