మనిషి అలవాట్లే మనిషికి మెట్లు. చప్పట్లు తిట్లు. మనిషికి ప్రత్యర్ధులు అలవాట్లు .మనిషికి మిత్రులు అలవాట్లే. మంచి అలవాట్లు చెడు అలవాట్లే మంచి మనుషులు చెడు మనుషులను చేస్తాయి.
నిరంతరం ప్రవహించే నీరు రాతిని కోసినట్లు. క్రమం తప్పకుండా అలవాట్లే మనిషిని సర్వనాశనం చేస్తాయి. మహోన్నతునిగా మారుస్తాయి.
ఆలోచనలను వదిలించుకోవచ్చు కానీ అలవాట్లను వదిలించుకోలేము. ఆదేశాలను భావోద్వేగాలను తప్పించుకోవచ్చు కానీ అలవాట్లను తప్పించుకోలేము.
ఎమోషనల్ ఫీలింగ్స్ బలమైన ఆయుధాలు అవే మనసును సృష్టిస్తాయి. కానీ అలవాట్లు మనసును కూడా మాయం చేస్తాయి.
అలవాట్లు మౌనంగానే ఉంటాయి కానీ ఘనంగా పనిచేస్తాయి. పుట్టుకతో వచ్చే అలవాట్లు గట్టిగా పని చేస్తాయి. అలవాట్లు కొన్ని వృత్తిగా మారితే మరికొన్ని ప్రవృత్తిగా మారుతాయి. మనం అలవాట్ల వెంటే పరిగెత్తుతాం.
నిర్ణయాలు నీవు తీసుకుంటే అలవాట్లు ఆగిపోతాయి. నిర్ణయాల వల్ల ఆలోచనలను ఆపవచ్చు. ఆలోచనల వల్ల అలవాట్లను మార్చవచ్చు. సంతోషం అలవాట్లలోనే ఉంటుంది. మనశ్శాంతి అలవాట్ల వల్లనే కలుగుతుంది. అందుకే అక్కడే ఆగిపోకు కొత్త అలవాట్లను సృష్టించు కొత్తగా జీవించు.
========================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా
ఒక్కో వాక్యం ఒక్కో మణి మాణిక్యం ఈ రోజులలో అవి ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది మీరు చెప్పినవి అన్నీ తక్షణమే పాటించేటట్లుగా ఉన్నాయి మేడం గారు మీకు అభినందనలు ఆండీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి